![]() |
![]() |

స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌కు వున్న క్రేజ్ వేరు. ‘ఆర్య’, ‘ఆర్య 2’తో టాలీవుడ్‌లో లవ్ స్టోరీస్‌లో ట్రెండ్ సెట్ చేశారు. ఇప్పుడీ హీరో, డైరెక్టర్ పాన్ ఇండియా లెవల్‌లో రస్టిక్ ఫిల్మ్ ‘పుష్ప’తో ట్రెండ్ క్రియేట్ చెయ్యడానికి రెడీ అవుతున్నారు. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ ‘పుష్ప: ది రైజ్’. ముందు ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా రిలీజ్ చెయ్యాలనుకున్నారు. కానీ, ఇప్పుడు ప్లాన్ మారింది. క్రిస్మస్‌కు వారం ముందే అల్లు అర్జున్ థియేటర్లలో సందడి చెయ్యడానికి వస్తున్నాడు.
డిసెంబర్ 17న ‘పుష్ప’ పార్ట్–1ను రిలీజ్ చెయ్యనున్నట్టు శనివారం అనౌన్స్ చేశారు. దాంతో రణ్‌వీర్ సింగ్‌కు, అల్లు అర్జున్‌కు మధ్య థియేటర్ల దగ్గర కాంపిటీషన్ తప్పింది. అదెలా అంటారా? కపిల్ దేవ్ అండ్ టీమ్ క్రికెట్ వరల్డ్ కప్ నెగ్గిన ఇన్సిడెంట్స్‌తో తీసిన సినిమా ‘83’. క్రిస్మస్‌కు రిలీజ్ చెయ్యనున్నట్టు రీసెంట్‌గా అనౌన్స్ చేశారు. అందులో కపిల్ దేవ్‌గా రణ్‌వీర్ నటించాడు. ఒకవేళ క్రిస్మస్‌కు ‘పుష్ప’ను రిలీజ్ చెయ్యాలని అనుకుంటే... రణ్‌వీర్, అల్లు అర్జున్ సినిమాల మధ్య పోటీ వుండేది. అసలు, క్రిస్మస్‌కు ‘పుష్ప’ను రిలీజ్ చెయ్యాలనుకున్నప్పుడు ‘83’ కాంపిటీషన్‌లో లేదు. ఆమిర్ ఖాన్ ‘లాల్ సింగ్ చద్దా’ వుంది. ఆమిర్ తన సినిమాను వాయిదా వెయ్యడంతో క్రిస్మస్ సీజన్ మీద రణ్‌వీర్ కర్ఛీఫ్ వేశాడు. అదీ సంగతి!
రణ్‌వీర్ సింగ్‌తో కాంపిటీషన్ వద్దని అల్లు అర్జున్ అనుకోవడంతో ఇద్దరికీ సోలో రిలీజ్ దొరికింది. ముందు వారం అల్లు అర్జున్ సినిమాకు మంచి సంఖ్యలో థియేటర్లు దొరుకుతాయి. నెక్ట్స్ వీక్ కొన్ని రణ్‌వీర్ సింగ్‌కు ఇచ్చినా ప్రాబ్లమ్ లేదు. కొన్ని థియేటర్లలో ఎలాగో తన సినిమాయే వుంటుంది.
![]() |
![]() |