![]() |
![]() |

మాలీవుడ్ రియల్ కపుల్ ఫహద్ ఫాజిల్, నజ్రీయా నజీమ్.. తెలుగు చిత్ర సీమ బాట పట్టిన సంగతి తెలిసిందే. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ టైటిల్ రోల్ లో బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ రూపొందిస్తున్న పాన్ - ఇండియా మూవీ `పుష్ప`తో ఫహద్ ఫాజిల్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండగా.. నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా `మెంటల్ మదిలో`, `బ్రోచేవారెవరురా!` చిత్రాల దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కిస్తున్న `అంటే.. సుందరానికీ!` చిత్రంతో నజ్రీయా నజీమ్ తెలుగునాట నాయికగా తొలి అడుగేస్తోంది.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. అటు ఫహద్, ఇటు నజ్రీయా టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న రెండు సినిమాలకు సంబంధించి ఓ కామన్ ఫ్యాక్టర్ ఉంది. అదేమిటంటే.. వీరిద్దరి టాలీవుడ్ ఎంట్రీ మూవీస్ ని ఒకే నిర్మాణ సంస్థ ప్రొడ్యూస్ చేయడం. ఆ సంస్థే.. హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన మైత్రీ మూవీ మేకర్స్. మరి.. నాణ్యతతో కూడిన చిత్రాలకు చిరునామాగా నిలుస్తూ ముందుకు సాగుతున్న మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలో వేర్వేరు సినిమాలతో తెలుగునాట తొలి అడుగులు వేస్తున్న ఫహద్, నజ్రీయా.. మొదటి ప్రయత్నాల్లోనే ఇక్కడ విజయకేతనం ఎగురవేస్తారేమో చూడాలి.
![]() |
![]() |