![]() |
![]() |

తెలుగునాట తనదైన విలనిజంతో ముందుకు సాగుతున్నారు సముద్రకని. తొలుత దర్శకుడిగా, ఆపై నటుడిగా ఇక్కడివారికి చేరువైన సముద్రకని.. గత కొంతకాలంగా విలన్ వేషాలతో ఇంప్రెస్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా.. 2020 సంక్రాంతికి విడుదలైన `అల వైకుంఠపురములో`లో అప్పల నాయుడుగా, 2021 ముగ్గుల పండక్కి మురిపించిన `క్రాక్`లో కఠారి కృష్ణగా ఎంటర్టైన్ చేశారు సముద్రకని. కాగా, ప్రస్తుతం ఈ టాలెంటెడ్ యాక్టర్ పలు తెలుగు చిత్రాలతో బిజీగా ఉన్నారు. వాటిలో `ఆర్ ఆర్ ఆర్`, `భీమ్లా నాయక్`, `సర్కారు వారి పాట` వంటి బిగ్ టికెట్ ఫిల్మ్స్ కూడా ఉన్నాయి.
ఇదిలా ఉంటే.. గత రెండేళ్ళుగా సంక్రాంతి సీజన్ లో నెగటివ్ రోల్స్ తో సందడి చేస్తూ వస్తున్న సముద్రకని.. 2022లోనూ ఆ పరంపరని కొనసాగించే పనిలో ఉన్నారు. అంతేకాదు.. ఈ సారి ఏకంగా రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ తో పొంగల్ సీజన్ లో పలకరించబోతున్నారు. ఆ చిత్రాలే.. `భీమ్లా నాయక్`, `సర్కారు వారి పాట`. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ రోల్ లో దర్శనమివ్వనున్న `భీమ్లా నాయక్` జనవరి 12న విడుదల కానుండగా.. సూపర్ స్టార్ మహేశ్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న `సర్కారు వారి పాట` జనవరి 13న రిలీజ్ కానుంది. మరి.. వరుసగా మూడోసారి సంక్రాంతి సీజన్ లో సందడి చేయనున్న సముద్రకనికి.. ఈ `డబుల్ ధమాకా` ఎంటర్టైన్మెంట్ ఏ మేరకు ప్లస్ అవుతుందో చూడాలి.
![]() |
![]() |