![]() |
![]() |

అక్కినేని నాగచైతన్య, సమంత విడాకులు తీసుకుంటారనే వార్త ఇప్పటిది కాదు. కొన్ని నెలలుగా చిత్ర పరిశ్రమ వర్గాల్లో వినబడుతోంది. వార్తలకు ఎక్కింది. అయితే... అటు సమంత, ఇటు నాగచైతన్య ఈ విషయం మీద పెదవి విప్పలేదు. తాము విడాకులు తీసుకుంటున్నట్టు ఎక్కడా చెప్పలేదు. అలాగని, ఖండించలేదు. మీడియాలో వస్తున్న కథనాలు బాధ కలిగించాయని మాత్రమే చెప్పారు.
ఇటీవల సమంతకు సోషల్ మీడియాలో 'మీరు ముంబై షిఫ్ట్ అవుతున్నారా?' అని ప్రశ్న ఎదురైంది. 'బయట వినిపిస్తున్న వంద పుకార్లలా ఇదీ నిజం కాదు' అని చెప్పారు. అయితే, నేడు నాగచైతన్య మౌనం వీడాడు. సమంత కూడా! విడాకుల వార్తను సోషల్ మీడియా వేదికగా ఇద్దరూ కన్ఫర్మ్ చేశారు.

ఎంతో ఆలోచించిన తర్వాత మా సొంత దారుల్లో ప్రయాణించాలని సమంత, నేను భార్యాభర్తలుగా వేరు పడాలని నిర్ణయించుకున్నట్టు నాగచైతన్య ట్వీట్ చేశాడు. సేమ్ పోస్టును సమంత ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. తమ మధ్య దశాబ్దానికి పైగా స్నేహం ఉండటం అదృష్టమని చెప్పుకొచ్చారు. ఈ కష్టకాలంలో అభిమానులు, శ్రేయోభిలాషులు, మీడియా మద్దతు ఇవ్వవలసిందిగా కోరారు.
![]() |
![]() |