![]() |
![]() |
.jpg)
అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ 'పుష్ప'. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా మూవీ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు మేకర్స్.
పుష్ప మూవీ రెండు భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగాన్ని ఈ ఏడాది చివర్లో క్రిస్మస్ కానుకగా విడుదల చేయనున్నట్లు గతంలో మూవీ టీమ్ ప్రకటించింది. అయితే ఈ మూవీ విడుదల వాయిదా పడొచ్చని ఇటీవల వార్తలొచ్చాయి. దానికి తోడు మెగాస్టార్ చిరంజీవి 'ఆచార్య' కూడా ఈ ఏడాది క్రిస్మస్ కే రానుందంటూ టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో 'పుష్ప' ఈ ఏడాది క్రిస్మస్ కి విడుదల అవుతుందా లేదా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే క్రిస్మస్ కి ఒక వారం ముందే విడుదల కానుంది. పుష్ప మొదటి భాగాన్ని డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టు మూవీ టీమ్ ప్రకటించింది. ఈ మేరకు రిలీజ్ డేట్ తో కూడిన పోస్టర్ ను విడుదల చేసింది.

మైత్రీ మూవీ మేకర్స్, ముత్యంశెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్టు పార్టుకు సంబంధించిన షూటింగ్ 90 శాతం వరకూ పూర్తి అయింది. ఇందులో మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ విలన్‌గా నటిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
![]() |
![]() |