![]() |
![]() |

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో శుక్రవారం ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రకాశ్‌రాజ్ ప్యానల్‌లోకి జీవితా రాజశేఖర్ రావడం తనకు ఇష్టం లేదంటూ... బయటకొచ్చిన బండ్ల గణేశ్, జనరల్ సెక్రటరీ పదవికి నామినేషన్ వేశారు. శుక్రవారం నాడు అనూహ్యంగా నామినేషన్ ఉపసంహరించుకుని ప్రకాశ్‌రాజ్‌కు మద్దతు పలికారు. ఆయన ప్యానల్‌లో కలిశారు. హీరోయిన్ పూనమ్ కౌర్ కూడా ‘మా’ ఎన్నికల బరిలో ప్రకాశ్‌రాజ్‌కు మద్దతు పలికింది.
‘‘ప్రకాశ్‌రాజ్ నెగ్గాలని కోరుకుంటున్నాను. ఆయన నెగ్గితే నా సమస్యలు చెప్తా. ప్రకాశ్‌రాజ్ రాజకీయాల్లో వేలు పెట్టడు. రాజకీయాలకు అతీతంగా ఉండే ఏకైక వ్యక్తి ఆయన. ఆ తర్వాత పెద్దలు చెప్పిన మాట వింటా. అదే నాకు శిరోధార్యం’’ అని పూనమ్ కౌర్ ట్వీట్ చేశారు. ఆమె ట్వీట్ అనూహ్యమని చెప్పాలి.
ఎన్నికల తేదీ దగ్గరపడుతూ ఉండటంతో ఇటు ప్రకాశ్‌రాజ్ ప్యానల్, అటు విష్ణు మంచు ప్యానల్ తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఒకరిపై మరొకరు విమర్శలకు దిగుతున్నారు. సూపర్‌స్టార్ కృష్ణను మోహన్‌బాబు, విష్ణు కలిశారు. ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు.
![]() |
![]() |