![]() |
![]() |

మాలీవుడ్ బ్లాక్ బస్టర్ `అయ్యప్పనుమ్ కోషియుమ్`కి రీమేక్ గా రూపొందుతున్న తెలుగు చిత్రం `భీమ్లా నాయక్`. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో వస్తున్న ఈ మల్టిస్టారర్ కి సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తుండగా.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. చిత్రీకరణ తుది దశకు చేరుకున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. 2022 సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్స్ లో సందడి చేయనుంది.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. గతంలో ఇదే జనవరి 12న దగ్గుబాటి, కొణిదెల కాంపౌండ్ హీరోలు విక్టరీ వెంకటేశ్, మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి నటించిన `ఎఫ్ 2` చిత్రం విడుదలైంది. హిలేరియస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మల్టిస్టారర్.. బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేయడమే కాకుండా ఆ ఏడాది సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. మరి.. `ఎఫ్ 2` తరహాలోనే కొణిదెల, దగ్గుబాటి కాంపౌండ్ హీరోల కాంబినేషన్ లో మల్టిస్టారర్ గా తెరకెక్కుతూ.. సేమ్ జనవరి 12న రాబోతున్న `భీమ్లా నాయక్` కూడా అదే బాట పడుతుందేమో చూడాలి.
![]() |
![]() |