![]() |
![]() |

సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా నటించిన 'రిపబ్లిక్' మూవీ అక్టోబర్ 1న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. దేవ్ కట్టా డైరెక్ట్ చేసిన ఈ మూవీలో అమెరికా నుంచి ఇండియాకు తిరిగొచ్చిన అమ్మాయిగా ఐశ్వర్యా రాజేశ్ కనిపించనుంది. ఆ క్యారెక్టర్‌కు ఐశ్వర్యను ఎందుకు ఎంచుకున్నట్లు? దీనికి దేవ్ దగ్గర ఉన్న సమాధానం తెలిస్తే ఆశ్చర్యం కలుగకమానదు. ఐశ్వర్య టాలెంట్ ఏమిటనేది కూడా ఆయన మాటల ద్వారా మనకు తెలుస్తుంది.
"ఆ క్యారెక్టర్‌కు ఒక స్ట్రాంగ్ యాక్టర్ కావాలి. 'కాకా ముట్టై' (తమిళ్) అనే సినిమా 80 లక్షల్లో తీశారంట.. ఆ సినిమా ఒక కల్ట్ రేజ్ అంట.. అని చెప్తే, పరిగెత్తుకుంటూ వెళ్లి సుజనా మాల్‌లో, ఆ సినిమా చూసి, ఎంతగా ఎగ్జయిట్ అయ్యానో!" అని చెప్పారు దేవ్, మీడియాకు ఇచ్చిన ప్రమోషనల్ ఇంటర్వ్యూలో. ఆ రోజు ఐశ్వర్య కళ్లల్లో ఏదో ఉందనే ఫీలింగ్ ఆయనకు కలిగింది.
"ఆమె కళ్లల్లో చాలా కథ కనిపించింది. ఆ కళ్లల్లో చాలా జీవితం కనిపించింది. రిపబ్లిక్ పోస్టర్‌లో ఆమెను చూస్తుంటే కూడా, నా కళ్లను తిప్పుకోలేను. ఆ విషయం ఆమెకు తెలుసో లేదో! పిచ్చిపిచ్చిగా ఉంటుంది కానీ." అని నవ్వేశారు దేవ్.
'కాకా ముట్టై' మూవీలో ఐశ్వర్య నటన ఆయన మీద చాలా ప్రభావం చూపించింది. "అప్పటికి నేను డైరెక్టర్‌ని అయినప్పటికీ, ఎప్పటికైనా ఇలాంటి అమ్మాయితో పనిచేస్తే బావుంటుంది అన్న ఫీల్ వచ్చింది నాకు. ఆ తర్వాత కూడా తనవి కొన్ని సినిమాలు చూశాను. 'రిపబ్లిక్'లో తను చేసిన క్యారెక్టర్‌కు చాలా మంచి సీన్లున్నాయి. నిస్సందేహంగా ఐశ్వర్య మాకు నేచురల్ చాయిస్." అని చెప్పుకుంటూ వచ్చారు దేవ్.
సో.. దేవ్ కట్టా లాంటి ప్రతిభావంతుడైన దర్శకుడు అంతగా చెప్పాడంటే 'రిపబ్లిక్' మూవీలో చేసిన క్యారెక్టర్‌తో ఐశ్వర్య మనల్ని ఎంతగా ఆకట్టుకోనుందో!
![]() |
![]() |