![]() |
![]() |
.jpg)
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'లవ్ స్టోరి'. సెప్టెంబర్ 24 న విడుదలైన ఈ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో నాగ చైతన్య, సాయి పల్లవిల యాక్టింగ్ కి ప్రశంసలు దక్కుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ముద్దు సన్నివేశం ఉంది.. అయితే వాస్తవానికి తాను నాగచైతన్యను ముద్దు పెట్టుకోలేదని సాయి పల్లవి తెలిపింది.
తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సాయి పల్లవి 'లవ్ స్టోరి' విశేషాలను పంచుకుంది. ఈ సినిమాలో సాయి పల్లవి, నాగ చైతన్య మధ్య లిప్ లాక్ సీన్ ఉంటుంది. ఈ ముద్దు సీన్ పై సాయి పల్లవి స్పందిస్తూ.. ఆ సన్నివేశంలో నాగచైతన్యను తాను నిజంగా ముద్దు పెట్టుకోలేదని తెలిపింది. అది కెమెరామెన్ గొప్పదనమని.. తాను నిజంగా ముద్దు పెట్టినట్టుగా కెమెరా యాంగిల్ పెట్టి చూపించారని చెప్పింది. తాను ఎప్పుడూ ముద్దు సన్నివేశాల్లో నటించలేదని.. ఇలాంటి సన్నివేశాలకు తాను తొలి నుంచి దూరమని తెలిపింది. ఈ సినిమాలో ముద్దు సీన్ లో నటించమని డైరెక్టర్ శేఖర్ కమ్ముల కూడా తనను ఇబ్బంది పెట్టలేదని సాయి పల్లవి చెప్పుకొచ్చింది.
కాగా 'లవ్ స్టోరి' మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ ను రాబడుతోంది. ఐదు రోజులలో రూ.26 కోట్లకు పైగా షేర్లను సాధించి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.
![]() |
![]() |