![]() |
![]() |

ప్రియుడు మోసం చేశాడని తీవ్ర మనస్తాపానికి గురై జూనియర్ ఆర్టిస్ట్ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
కావలి అనురాధ అనే యువతి ఫిలింనగర్ లోని జ్ఞానిజైల్‌సింగ్‌నగర్ బస్తీలో నివాసం ఉంటుంది. కిరణ్ అనే యువకుడుతో అనురాధ గత కొంతకాలం నుంచి ప్రేమలో ఉంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి అతడు.. అనురాధతో ఏడాది నుంచి సహజీవనం చేస్తున్నాడు. కానీ కిరణ్ ఇటీవల మరో అమ్మాయితో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు. ఈ విషయంలో కిరణ్ తో గొడవపడిన అనురాధ.. మనస్తాపానికి గురై తన గదిలో ఫ్యాన్ కి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
అనురాధ గది నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకి సమాచారం ఇచ్చారు. మృతురాలి సోదరి సరోజ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడు కిరణ్ పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
![]() |
![]() |