![]() |
![]() |

కోలీవుడ్ స్టార్ సూర్య 'సింగం' సినిమాలో నెగటివ్ పాత్రలో నటించిన చకువుమె మెల్విన్(45) డ్రగ్స్ విక్రయిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. బెంగళూరులోని హెచ్‌బీఆర్ లేఅవుట్ బీడీఏ కాంప్లెక్స్ వద్ద మెల్విన్ డ్రగ్స్ విక్రయిస్తుండగా బెంగళూరు సెంట్రల్ క్రైమ్(సీసీబీ) పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. అతడి నుంచి రూ.8 లక్షలు విలువ చేసే డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
నైజీరియన్ అయిన మెల్విన్ వైద్యం కోసం భారత్ వచ్చి.. ముంబైలోని ఓ ఫిల్మ్ అకాడమీలో నటనలో శిక్షణ తీసుకున్నాడు. కన్నడ, తమిళ, హిందీ భాషల్లో పలు సినిమాలలో నటించాడు. విశ్వరూపం, సింగం, అణ్ణబాండ్, పరమాత్మ వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. కరోనా సమయంలో సినిమా అవకాశాలు లేకపోవడంతో మెల్విన్ డ్రగ్స్ వ్యాపారంలోకి దిగినట్టు తెలుస్తోంది.

కాగా మెల్విన్ ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఈ వ్యవహారంతో సినీ పరిశ్రమకు చెందిన వారికి ఎవరికైనా సంబంధం ఉందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
![]() |
![]() |