![]() |
![]() |

`జనతా గ్యారేజ్` (2016) వంటి సెన్సేషనల్ హిట్ తరువాత యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ - విజనరీ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో మరో సినిమా రాబోతున్న విషయం విదితమే. పాన్ - ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కనున్న ఈ భారీ బడ్జెట్ మూవీని యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్నాయి. ఇందులో తారక్ నెవర్ సీన్ బిఫోర్ రోల్ లో దర్శనమివ్వబోతున్నట్లు టాక్.
ఇదిలా ఉంటే.. త్వరలోనే పట్టాలెక్కనున్న ఈ సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే.. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఆర్. రత్నవేలు ఈ చిత్రానికి ఛాయాగ్రహణం అందించబోతున్నారట. అదే గనుక నిజమైతే.. అటు తారక్ తోనూ, ఇటు కొరటాలతోనూ రత్నవేలుకి ఇదే మొదటి సినిమా అవుతుంది. త్వరలోనే తారక్ - కొరటాల సెకండ్ జాయింట్ వెంచర్ లో రత్నవేలు ఎంట్రీపై క్లారిటీ రానుంది.
కాగా, తారక్ తాజా చిత్రం `ఆర్ ఆర్ ఆర్` ఇటీవలే చిత్రీకరణ పూర్తిచేసుకోగా.. కొరటాల ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ `ఆచార్య` ఫినిషింగ్ స్టేజ్ లో ఉంది. ఇక రత్నవేలు విషయానికి వస్తే `వెట్రి` అనే తమిళ సినిమా చేస్తున్నారు.
![]() |
![]() |