![]() |
![]() |

సెప్టెంబర్ 8న శంకర్ డైరెక్షన్‌లో 'ఆర్‌సీ 15' మూవీని గ్రాండ్‌గా లాంచ్ చేసిన రామ్‌చరణ్, తన ఇంటికి రూ. 4 కోట్ల విలువైన మెర్సిడెస్ మేబాచ్ జిఎల్ఎస్ 600 (కస్టమైజ్డ్ వెర్షన్) కారును ఇంటికి తీసుకొచ్చాడు. ఇండియాలో ఈ కారును పొందిన మొట్టమొదటి వ్యక్తి చరణ్. ఆయన గారేజ్‌లో ఆస్టన్ మార్టిన్ వి8 వాంటేజ్, రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ, రోల్స్ రాయిస్ ఫాంటమ్, మెర్సిడెస్ బెంజ్ జిఎల్ 350 వంటి సూపర్ కార్ కలెక్షన్ ఉంది.
జూనియర్ ఎన్టీఆర్‌తో తన తదుపరి సినిమా 'ఆర్‌ఆర్‌ఆర్'లో కనిపించబోతున్న రామ్ చరణ్, సెప్టెంబర్ 12 ఆదివారం నాడు మెర్సిడెస్ మేబాచ్ జిఎల్ఎస్ 600 (కస్టమైజ్డ్ వెర్షన్) అనే మరో లగ్జరీ కారును తనే స్వయంగా నడుపుతూ ఇంటికి తీసుకొని వచ్చాడు. ఆ కారు విలువ రూ. 4 కోట్లు. ఇంటర్నెట్‌లో వైరల్ అయిన ఫొటోలలో, రామ్ చరణ్ తన కొత్త కారులో ఇంటికి వెళ్తున్నప్పుడు కారు ముందు పోజులిచ్చి, దాన్ని సొంతం చేసుకున్న ఆనందాన్ని ఆస్వాదిస్తూ కనిపించాడు.

రాజమౌళి సినిమా 'ఆర్ఆర్ఆర్' ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు రామ్‌చరణ్. ప్రేక్షకులు అత్యంత కుతూహలంగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటైన 'ఆర్ఆర్‌ఆర్'లో జూనియర్ ఎన్టీఆర్, అజయ్ దేవ్‌గణ్, అలియా భట్, ఒలీవియా మోరిస్ ప్రధాన పాత్రధారులు. అక్టోబర్ 13న విడుదల కావాల్సిన ఆ మూవీని, దేశంలో చాలా ప్రదేశాల్లో థియేటర్లు మూతపడి ఉన్నందున, పోస్ట్‌పోన్ చేశారు. ఎప్పుడు విడుదల చేసేదీ తర్వాత ప్రకటిస్తారు.
![]() |
![]() |