![]() |
![]() |

ఆఫీసులో కూర్చొని సభ్యుల సమస్యలను, వారికి సంబంధించిన విషయాలను పట్టించుకొని అప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకొనే వీలు, వెసులుబాటు కలిగినవారే మా అధ్యక్ష పదవికి కానీ, ఇతర పదవులకు కానీ పోటీ చేయాలని సీనియర్ నటుడు సుమన్ అభిప్రాయపడ్డారు.
మీడియాతో మాట్లాడిన ఆయన, మనం ఆఫీసు తీసుకొని, షూటింగ్‌లో బిజీగా ఉండి 'ఖాళీగా ఉన్నప్పుడు వస్తాను' అనో, 'ఫోన్‌లో మాట్లాడతాను' అనో, 'వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడతాను' అనడం అనేది నాకు సరిగా అనిపించలేదు. మనం పూర్తిగా ఆఫీసులో ఉంటూ, కష్టసుఖాలు చూసుకుంటూ ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండాలి. అలా చేయలేను కాబట్టే నేను ఎన్నికల్లో నిలబడలేదు." అని చెప్పారు.
అధ్యక్ష పదవి గురించి మాట్లాఉడతూ, "రెండు పడవల్లో రెండు కాళ్లు పెట్టకూడదు. అధ్యక్ష పదవి అనేది చాలా ముఖ్యమైనది. దాన్ని చేయడం అంత ఈజీ కాదు. నా కోసం వెయిట్ చేయండని చెప్పడం, 'ఆయనకు చెప్పాను.. ఆయన చూసుకుంటారు' అని చెప్పడం కాదు, మనం ఉండాలి. బిజీగా ఉన్న ఆర్టిస్టులు దాన్ని చేపట్టడం కరెక్టేమో నాకు తెలియడం లేదు. అది నా అభిప్రాయం. అందుకే నేను పోటీ చేయట్లేదు" తేల్చేశారు సుమన్.
ఆయన మాటలు 'మా' అధ్యక్ష పదవికి పోటీలో ఉన్న కన్నడ నటుడు ప్రకాశ్‌రాజ్‌కు వర్తిస్తాయని వేరే చెప్పనవసరం లేదు. పలు భాషల్లో పలు చిత్రాలు చేస్తూ, ఎప్పుడూ బిజీగా ఉండే ప్రకాశ్‌రాజ్, ఒకవేళ 'మా' అధ్యక్షుడిగా ఎంపికైతే, ఎలా తన టైమ్‌ను మా మెంబర్ల కష్టసుఖాలు తెలుసుకోడానికి వినియోగిస్తారో తెలీదు.
![]() |
![]() |