![]() |
![]() |

క్రేజీ ప్రాజెక్ట్స్ కి కేరాఫ్ అడ్రస్ లా నిలుస్తున్న నిర్మాణ సంస్థల్లో మైత్రీ మూవీ మేకర్స్ ఒకటి. దాదాపు టాలీవుడ్ టాప్ స్టార్స్ అందరితోనూ సినిమాలు చేస్తూ.. వార్తల్లో నిలుస్తోంది మైత్రి. అంతేకాదు.. `పుష్ప`తో పాన్ - ఇండియా బాట కూడా పడుతోంది ఈ పాపులర్ ప్రొడక్షన్ హౌస్.
ఇదిలా ఉంటే.. కోలీవుడ్ స్టార్ ధనుష్ తోనూ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఓ భారీ బడ్జెట్ మూవీని నిర్మించబోతున్నట్లు సమాచారం. `పుష్ప` తరహాలో ఇది కూడా పాన్ - ఇండియా మూవీగా రూపొందనుందని వినికిడి. అంతేకాదు.. గత కొద్ది రోజులుగా ప్రచారంలో ఉన్న `ఆర్ ఎక్స్ 100` ఫేమ్ అజయ్ భూపతి - ధనుష్ కాంబో మూవీనే ఇదని బజ్. శేఖర్ కమ్ముల, వెంకీ అట్లూరి డైరెక్టోరియల్స్ తరువాత ధనుష్ చేయబోయే మూడో తెలుగు చిత్రంగా వార్తల్లో ఉన్న ఈ సినిమాని.. మైత్రీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ధనుష్ - మైత్రీ మూవీ మేకర్స్ కాంబినేషన్ మూవీపై క్లారిటీ రానుంది.
కాగా, `ఆర్ ఆర్ ఆర్`ని నిర్మించిన డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బేనర్ లోనూ ధనుష్ ఓ సినిమా చేయబోతున్నట్లు కథనాలు వస్తున్నాయి. మొత్తమ్మీద.. ధనుష్ టాలీవుడ్ పై ఫుల్ ఫోకస్ పెడుతూ ఇక్కడ హాట్ టాపిక్ అవుతున్నారు.
![]() |
![]() |