![]() |
![]() |

రీసెంట్ గా ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అయిన `నెట్రిక్కన్`తో పలకరించింది లేడీ సూపర్ స్టార్ నయనతార. అందులో అంధురాలి పాత్రలో తనదైన అభినయంతో మరోమారు అభిమానులను అలరించింది. ప్రధానంగా తమిళంలో రూపొందిన ఈ థ్రిల్లర్ మూవీ.. తెలుగులోనూ అనువాద రూపంలో ఎంటర్టైన్ చేసింది. కట్ చేస్తే.. తక్కువ గ్యాప్ లోనే మరో రెండు సినిమాలతో సందడి చేయనుంది నయన్. కాకపోతే, ఈ రెండు చిత్రాలు కూడా థియేట్రికల్ రిలీజ్ నే టార్గెట్ చేసుకున్నాయి.
ఆ వివరాల్లోకి వెళితే.. మ్యాచో స్టార్ గోపీచంద్ తో నయనతార నటించిన తెలుగు చిత్రం `ఆరడుగుల బుల్లెట్`. 2017లోనే విడుదల కావాల్సిన ఈ యాక్షన్ డ్రామా.. కొన్ని కారణాల వల్ల విడుదలకు నోచుకోలేదు. కాగా, ఎట్టకేలకు ఈ సినిమాని అక్టోబర్ లో రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మరోవైపు సూపర్ స్టార్ రజినీకాంత్ తో కలిసి నయనతార నటించిన తాజా చిత్రం `అణ్ణాత్తే` దీపావళి కానుకగా నవంబర్ 4న తెరపైకి రానుంది. తమిళంతో పాటు తెలుగులోనూ ఒకే రోజున ఈ సినిమా థియేటర్స్ లోకి రాబోతోంది. మరి.. తక్కువ గ్యాప్ లోనే రాబోతున్న ఈ రెండు చిత్రాలు.. నయన్ కి ఎలాంటి గుర్తింపుని, ఫలితాన్ని అందిస్తాయో చూడాలి.
![]() |
![]() |