![]() |
![]() |

మాలీవుడ్ బ్లాక్ బస్టర్ `దృశ్యం`కి సీక్వెల్ గా రూపొందిన చిత్రం `దృశ్యం 2`. మోహన్ లాల్, మీనా జంటగా నటించిన ఈ ఫ్యామిలీ థ్రిల్లర్ ఈ ఏడాది ఆరంభంలో ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అయి.. సెన్సేషన్ క్రియేట్ చేసింది. కట్ చేస్తే.. ఇప్పుడీ సినిమా తెలుగులోనూ అదే పేరుతో రీమేక్ రూపంలో సిద్ధమైంది. `దృశ్యం` తెలుగు రీమేక్ లో నటించిన వెంకటేశ్, మీనా.. ఈ సీక్వెల్ రీమేక్ లోనూ ప్రధాన పాత్రల్లో దర్శనమివ్వనున్నారు. మాతృకకి దర్శకత్వం వహించిన జీతూ జోసెఫ్.. రీమేక్ ని కూడా డైరెక్ట్ చేశారు.
ఇదిలా ఉంటే.. `దృశ్యం 2`ని దసరా సీజన్ లో రిలీజ్ చేయబోతున్నట్లు గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. అక్టోబర్ 13న ఈ సినిమాని థియేటర్స్ లో విడుదల చేయబోతున్నారట. వాస్తవానికి, అక్టోబర్ 13న రాజమౌళి డైరెక్టోరియల్ `ఆర్ ఆర్ ఆర్` విడుదల కావాల్సి ఉంది. అయితే, కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ సినిమా వాయిదా పడడంతో.. ఇప్పుడా తేదిని `దృశ్యం 2` కోసం లాక్ చేశారని బజ్. త్వరలోనే `దృశ్యం 2` రిలీజ్ డేట్ పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.
కాగా, `దృశ్యం 2`లో నరేశ్, నదియా, సంపత్ రాజ్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించగా అనూప్ రూబెన్స్ సంగీతమందించారు.
![]() |
![]() |