![]() |
![]() |

గోపీచంద్, తమన్నా జంటగా సంపత్ నంది డైరెక్ట్ చేసిన యాక్షన్ ఎంటర్‌టైనర్ 'సీటీమార్' బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను సాధిస్తూ, హిట్ దిశగా దూసుకుపోతోంది. కబడ్డీ బ్యాక్‌డ్రాప్‌తో తీసిన ఈ సినిమా మాస్ ఆడియెన్స్‌ను బాగా ఎంటర్‌టైన్ చేస్తోందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. రెండు రోజుల్లో ఈ సినిమా 4.95 కోట్ల షేర్‌ను వసూలు చేసిందని అంచనా. కాగా 'సీటీమార్' బ్లాక్‌బస్టర్ అయ్యిందంటూ ప్రభాస్ ప్రశంసించడం గోపీచంద్‌నూ, ఆయన అభిమానుల్నీ, 'సీటీమార్' టీమ్‌నూ ఆనందపరవశుల్ని చేస్తోంది.
తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసిన పోస్ట్‌లో ప్రభాస్, "సీటీమార్‌తో నా ఫ్రెండ్ గోపీచంద్ బ్లాక్‌బస్టర్ కొట్టాడు.. అతని విషయంలో నాకు చాలా సంతోషంగా ఉంది. కొవిడ్ సెకండ్ వేవ్ తర్వాత ఏర్పడిన ప్రతికూల పరిస్థితుల మధ్య ఫస్ట్ బిగ్ ఫిల్మ్‌ను రిలీజ్ చేయడానికి ముందుకు వచ్చిన మూవీ టీమ్‌కు కుదోస్" అని రాసుకొచ్చాడు. దాంతో పాటు విజిల్ పిక్చర్ కూడా పెట్టాడు.

ప్రభాస్ పోస్ట్‌కు గోపీచంద్, సంపత్ నంది రెస్పాండ్ అయ్యారు. ప్రభాస్ పోస్ట్‌ను షేర్ చేసిన గోపీచంద్, "నీ మంచి మాటలకు, ప్రేమకు థాంక్యూ మై ఫ్రెండ్ ప్రభాస్! సీటీమార్ అందుకుంటున్న రెస్పాన్స్‌కు నిజంగా అమితానందంగా ఉంది" అని రాశాడు. సంపత్ నంది అయితే, "Thanks a ton for the kind words, encouragement n support always #Prabhas garu" అని రాసుకొచ్చాడు.
'సీటీమార్' మంచి వసూళ్లను సాధిస్తున్న సందర్భంగా గోపీచంద్ సహా సీటీమార్ టీమ్ ఆదివారం బాణాసంచా కాల్చి సక్సెస్ సెలబ్రేషన్స్ జరుపుకుంది.
![]() |
![]() |