![]() |
![]() |

ఒకరిద్దరు కాదు... ఏకంగా ఏడుగురు హౌస్‌మేట్స్‌కి కాజల్ అంటే కసి ఉంది. ఆమెపై కోపంగా ఉన్నారు. ప్రతి అంశంలోనూ ఆమె జోక్యం ఎక్కువ అవుతోందని, హుషారుగా ఉంటుందని ఆమె అంటే నచ్చడం లేదని చెప్పారు. అందుకని, కాజల్ సెట్ కాలేదంటూ ఆమె ఫొటోలు చించి చెత్తబుట్టలో పడేశారు. మొత్తం మీద 'బిగ్ బాస్' ఫస్ట్ వీకెండ్/శనివారం ఎపిసోడ్... నెక్స్ట్ వీక్ ఎలిమినేషన్ ప్రక్రియలో ఎవరు ఉండొచ్చు అనే విషయంలో ఒక హింట్ ఇచ్చింది. అసలు, శనివారం ఏం జరిగిందనే అంశంలోకి వెళితే...
ప్రతి వీకెండ్ హోస్ట్ నాగార్జున 'బిగ్ బాస్'కి వస్తారు, సందడి చేస్తారు అనేది తెలిసిందే. కర్టెన్ రైజర్ ఎపిసోడ్ తర్వాత తొలిసారి నాగార్జున షోలో సందడి చేశారు. షో మొదలై వారం కూడా కాలేదు కాబట్టి... ఫస్ట్ వీకెండ్ ఇంటి సభ్యులకు కొంత ఫ్రీడమ్, రిలీఫ్ ఇచ్చారు. 'సెట్ అండ్ కట్' పేరుతో ఓ గేమ్ ఆడించారు.
'సెట్ అండ్ కట్' గేమ్ ఏంటంటే... హౌస్‌లో మొత్తం 19మంది సభ్యులు ఉన్నారు కదా! వాళ్లలో ఒక్కొక్కరూ తమకు 19మందిలో ఎవరితో సెట్ అయ్యింది? అనేది చెప్పాలి. సెట్ అయినవాళ్లకు బ్యాండ్ కట్టాలి. ఎవరితో కట్ అయ్యింది? అనేదీ చెప్పాలి. ఎందుకు కట్ చేసుకుంటున్నారో చెప్పి, వాళ్ల ఫొటోను కట్ చేసి చెత్త బుట్టలో పడేయాలి.
విశ్వ, లహరి, లోబో, శ్రీరామచంద్ర, నటరాజ్, ఉమా... వీళ్ళందరూ కాజల్ ఫొటో చింపేయడం గమనార్హం. గతంలో లహరి, కాజల్ మధ్య గొడవ అయిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఉమాదేవి అయితే కట్ చేసే సమయంలో కొంత ఓవర్ అయ్యిందని చెప్పాలి. టోటల్ గేమ్ లో కాజల్ మెచ్యూరిటీ చూపించింది. తనను కట్ చేసిన శ్రీరామచంద్రను సెట్ చేసుకుంది. అతడికి బ్యాండ్ కట్టింది. ఉమాదేవిని కట్ చేసింది. ఈ గేమ్ చూస్తే... నెక్స్ట్ వీక్ ఎలిమినేషన్ నామినేషన్స్ లో కాజల్ పేరు ఉండేలా ఉంది.
![]() |
![]() |