![]() |
![]() |

బ్లాక్ బస్టర్ మూవీ `ఉప్పెన`తో టాలీవుడ్ లో హీరోయిన్ గా డ్రీమ్ డెబ్యూ ఇచ్చింది కృతి శెట్టి. అందులోని బేబమ్మ పాత్రతో కుర్రకారుని ఫిదా చేసేసింది. కట్ చేస్తే.. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఐదు చిత్రాలతో బిజీగా మారిపోయింది. వీటిలో నేచురల్ స్టార్ నానితో జతకట్టిన `శ్యామ్ సింగ రాయ్` ఇటీవలే చిత్రీకరణ పూర్తిచేసుకోగా.. మరో నాలుగు సినిమాలు నిర్మాణ దశలో ఉన్నాయి. అంతేకాదు.. 2022లో ఈ చిత్రాలన్నీ జనం ముందుకు రాబోతున్నాయి.
ఆ వివరాల్లోకి వెళితే.. సుధీర్ బాబుకి జంటగా కృతి నటిస్తున్న `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి` చిత్రీకరణ దశలో ఉండగా.. ఎనర్జిటిక్ స్టార్ రామ్ కి జోడీగా లింగుస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న పేరు నిర్ణయించని ద్విభాషా చిత్రం కూడా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అలాగే రీసెంట్ గా యువసామ్రాట్ నాగచైతన్య సరసన `బంగార్రాజు`లోనూ, యూత్ స్టార్ నితిన్ కి పెయిర్ గా `మాచర్ల నియోజకవర్గం`లోనూ కృతి శెట్టి ఎంపికైంది. కాగా, ఈ సినిమాలన్నీ కూడా 2022 ప్రథమార్ధంలో రిలీజ్ కాబోతున్నాయి.
మొత్తమ్మీద.. 2022 బేబమ్మ నామ సంవత్సరంగా నిలిచిపోనుందన్నమాట. మరి.. ఆయా చిత్రాలతో కృతి ఎలాంటి గుర్తింపుని, ఫలితాలను అందుకుంటుందో చూడాలి.
![]() |
![]() |