![]() |
![]() |

మ్యాచో స్టార్ గోపీచంద్, మెలోడీబ్రహ్మ మణిశర్మది సూపర్ హిట్ కాంబినేషన్. వీరిద్దరి కలయికలో వచ్చిన `యజ్ఞం`, `రణం`, `లక్ష్యం`, `శౌర్యం` చిత్రాలు అటు మ్యూజికల్ గానూ, ఇటు కమర్షియల్ గానూ మెప్పించాయి. ఇక రీసెంట్ గా రిలీజైన `సీటీమార్` కూడా బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపిస్తోంది. అలాంటి ఈ ఇద్దరి కాంబినేషన్ లో మరో సినిమా రాబోతోందని సమాచారం.
ఆ వివరాల్లోకి వెళితే.. `లక్ష్యం`, `లౌక్యం` తరువాత శ్రీవాస్ దర్శకత్వంలో గోపీచంద్ ముచ్చటగా మూడో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించనున్న ఈ ప్రాజెక్ట్.. అతి త్వరలో పట్టాలెక్కనుంది. కాగా, ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా మణిశర్మని ఎంపిక చేశారని సమాచారం. త్వరలోనే గోపి - శ్రీవాస్ కాంబో మూవీలో మణిశర్మ ఎంట్రీపై క్లారిటీ రానుంది. మరి.. `లక్ష్యం` వంటి విజయవంతమైన చిత్రం తరువాత గోపి- మణి - శ్రీవాస్ త్రయం నుంచి రాబోతున్న కొత్త సినిమా కూడా అదే బాట పడుతుందేమో చూడాలి.
కాగా, ప్రస్తుతం `పక్కా కమర్షియల్`తో గోపీచంద్ బిజీగా ఉండగా.. `ఆచార్య`, `శాకుంతలం`, `రిపబ్లిక్` వంటి క్రేజీ ప్రాజెక్ట్స్ తో పాటు మరో అరడజను సినిమాలు చేస్తున్నారు మణిశర్మ.
![]() |
![]() |