![]() |
![]() |

నడుపుతున్న బైక్ స్కిడ్ కావడంతో ప్రమాదానికి గురై తీవ్ర గాయాల పాలైన చిరంజీవి మేనల్లుడు, హీరో సాయిధరమ్ తేజ్‌ను అంబులెన్సులో పోలీసులు హైటెక్ సిటీలోని మెడికవర్ హాస్పిటల్‌లో చేర్పించారు. వైద్యులు చికిత్స ప్రారంభించాక సాయితేజ్ స్పృహలోకి వచ్చారు. అనంతరం మరింత మెరుగైన చికిత్స కోసం జూబ్లీహిల్స్‌లోని అపోలో హాస్పిటల్‌కు సాయితేజ్‌ను తరలించారు. బ్రెయిన్ స్కాన్‌లో ఆయన తలకు గాయాలేమీ తగల్లేదని తేలింది. ఆయనకు ప్రాణాపాయం లేదని వైద్యులు స్పష్టం చేశారు. ఛాతీపైన ఉండే క్లావికల్ బోన్ ఫ్రాక్చర్ అయిందని సమాచారం.
రోడ్డుపైన మట్టిపేరుకుని ఉండటం వల్ల, దానిమీద వెళ్తూ, బైక్ స్కిడ్ అయిందని మాదాపూర్ పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో సాయితేజ్ హెల్మెట్ ధరించి వున్నారనీ, ఆయన ఆల్కహాల్ సేవించలేదని తేలిందనీ వారు చెప్పారు.
.jpg)
కాగా మెడికవర్ హాస్పిటల్‌లో సాయితేజ్‌ను చేర్పించాక, మేనల్లుడి ఆరోగ్య స్థితి తెలుసుకోవడానికి స్వయంగా వచ్చారు పవన్ కల్యాణ్. అప్పటికి ఇంకా సాయితేజ్ స్పృహలోకి రాలేదని ఆయన చెప్పారు. ఆ తర్వాత సాయితేజ్‌ను అపోలో హాస్పిటల్‌కు తరలించారు. అక్కడకు అల్లు అరవింద్, వరుణ్‌తేజ్, నిహారిక, వైష్ణవ్ తేజ్, ఇతర కుటుంబ సభ్యులు కూడా వచ్చి, సాయితేజ్ యోగక్షేమాలు తెలుసుకుంటున్నారు.
![]() |
![]() |