![]() |
![]() |

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికలు టాలీవుడ్ లో హీట్ ని పెంచాయి. పలువురు సినీ ప్రముఖులు ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేలుస్తున్నారు. ముఖ్యంగా బండ్ల గణేష్ వ్యవహారం ఇటీవల హాట్ టాపిక్‌గా మారిపోయింది. ప్రకాష్ రాజ్ ప్యానల్ నుండి బయటకు వచ్చిన ఆయన.. జీవితా రాజశేఖర్ పై విరుచుకుపడ్డారు. అయితే తాజాగా ఆయన వ్యాఖ్యలపై స్పందించిన జీవిత.. అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు.
మా అధ్యక్ష బరిలో నిలిచిన ప్రకాష్ రాజ్ ప్యానల్ లో మొదట బండ్ల గణేష్ కూడా ఉన్నారు. అయితే ప్రకాష్ రాజ్ ప్యానల్ లోకి అనూహ్యంగా జీవిత రావడంతో ఆ ప్యానల్ నుంచి బండ్ల గణేష్ బయటకు వచ్చారు. మెగా ఫ్యామిలీని జీవిత ఎన్నోసార్లు కించపరిచారంటూ వివాదానికి తెరలేపారు. జీవిత పలు పార్టీలు మారారంటూ కామెంట్ చేశారు. అంతేకాదు, ప్రకాష్ రాజ్ ప్యానల్ నుండి జనరల్ సెక్రటరీగా పోటీ చేస్తున్న జీవితపై ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని బండ్ల ప్రకటించారు.
తాజాగా ఓ టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన జీవిత.. బండ్ల గణేశ్ వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు. 'మా' ఎన్నికల గురించి కాకుండా.. చిరంజీవి ఇష్యూపై మాట్లాడాల్సిన అవసరం ఏముందని నిలదీశారు. బండ్ల గణేష్ అంటే తనకు డోంట్ కేర్ అని.. ఆయన గురించి మాట్లాడటం కూడా వేస్ట్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన బతుకు గురించి ఆయనకు ఎందుకని.. తాను పార్టీలు మారితే ఆయనకు వచ్చిన నష్టమేమిటని మండిపడ్డారు. మెగా ఫ్యామిలీని ఎంతో మంది విమర్శించి ఉంటారని.. వాళ్లందరినీ వెలి వేస్తారా? అని జీవిత ప్రశ్నించారు.
![]() |
![]() |