![]() |
![]() |

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. 'గబ్బర్ సింగ్' వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ నుండి అప్డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే రేపు(గురువారం) ఈ మూవీ నుండి క్రేజీ అప్డేట్ రానుంది.
పవన్ పుట్టిన రోజు సందర్భంగా సెప్టెంబర్ 2న ఈ సినిమాకి సంబంధించిన ప్రీ లుక్ ను వదిలారు. ఇక ఈ సినిమా నుంచి రేపు(సెప్టెంబర్ 9) ఉదయం 9:45 నిమిషాలకు పవర్ ప్యాక్డ్ అనౌన్స్ మెంట్ ఒకటి ఉంటుందని తాజాగా మేకర్స్ సోషల్ మీడియా వేదికగా ప్రకటన ఇచ్చారు. రేపటి ఎనౌన్స్ మెంట్ ద్వారా టైటిల్, షూటింగ్ వంటి విషయాలపై క్లారిటీ ఇచ్చే అవకాశముంది అంటున్నారు. కాగా ఈ సినిమా కోసం 'భవదీయుడు భగత్ సింగ్', 'ఇప్పుడే మొదలైంది' వంటి టైటిల్స్ ను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.

కాగా, ప్రస్తుతం 'హరిహర వీరమల్లు', 'భీమ్లా నాయక్' సినిమాలతో బిజీగా ఉన్న పవన్.. అవి పూర్తైన తర్వాత హరీష్ తో సినిమా చేయనున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ మూవీలో పవన్ కు జోడీగా పూజా హెగ్డే అలరించనుందనే టాక్ వినిపిస్తోంది.
![]() |
![]() |