![]() |
![]() |
![]()
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - స్టార్ ప్రొడ్యూసర్ `దిల్` రాజుది సక్సెస్ ఫుల్ కాంబినేషన్. `ఆర్య`(2004), `పరుగు` (2008), `ఎవడు` (2014) (ఇందులో బన్నీది అతిథి పాత్ర), `డీజే` (2017).. ఇలా వీరిద్దరి కలయికలో వచ్చిన సినిమాలన్నీ విజయపథంలో పయనించాయి. కట్ చేస్తే.. నాలుగేళ్ళ విరామం అనంతరం ఈ ఇద్దరు మరోమారు జట్టుకట్టనున్నారు. `ఐకాన్` పేరుతో రూపొందనున్న ఈ పాన్ - ఇండియా మూవీకి `వకీల్ సాబ్` ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించనున్నారు. ఇందులో అల్లు అర్జున్ కి జంటగా `బుట్టబొమ్మ` పూజా హెగ్డే, `ఉప్పెన` ఫేమ్ కృతి శెట్టి సందడి చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు దసరా సందర్భంగా జరుగనున్నాయని.. రెగ్యులర్ షూటింగ్ ని మాత్రం డిసెంబర్ ద్వితీయార్ధంలో ప్రారంభించనున్నారని సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించి క్లారిటీ రానుంది. మరి.. `ఐకాన్` కోసం ఐదోసారి టీమ్ అప్ అయిన బన్నీ, రాజు.. ఈ సారి కూడా విజయఢంకా మ్రోగిస్తారేమో చూడాలి.
కాగా, అల్లు అర్జున్ ప్రస్తుతం `పుష్ప` చేస్తున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ పాన్ - ఇండియా మూవీ తాలుకూ మొదటి భాగం `పుష్ప - ద రైజ్` క్రిస్మస్ కానుకగా థియేటర్స్ లోకి రానుంది.
![]() |
![]() |