![]() |
![]() |

'ఆదిపురుష్' మూవీలో ప్రభాస్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంటోంది కృతి సనన్. ప్రాజెక్ట్, నటీనటులను ప్రకటించినప్పట్నుంచీ ఆ మూవీ హెడ్‌లైన్స్‌లో నిలుస్తోంది. రామాయణ గాథ ఆధారంగా ఈ మూవీని ఓం రౌత్ డైరెక్ట్ చేస్తున్నాడు. మూడు రోజుల క్రితం ఈ సినిమా షూటింగ్ ముంబైలో ప్రారంభమైంది. ఇది ప్రభాస్ నటిస్తోన్న మరో పాన్ ఇండియా ఫిల్మ్ కావడంతో ఫ్యాన్స్ ఎగ్జయిట్ అవుతున్నారు.
'బాహుబలి' రిలీజయ్యాక దేశంలోని అత్యంత పాపులర్ యాక్టర్స్‌లో ఒకరిగా గుర్తింపు పొందాడు ప్రభాస్. అలాంటి అతనితో ఎవరు మాత్రం ప్రేమలో పడకుండా ఉంటారు! కృతి సనన్ కూడా అందుకు మినహాయింపు కాదు. అందుకే అవకాశం లభిస్తే అతడ్ని పెళ్లాడాలనుకుంటోందామె. ఇటీవలే డిజిటల్ ప్లాట్‌ఫామ్ మీద రిలీజై సక్సెస్ అయిన 'మిమి' మూవీలో నటనకు అందరి ప్రశంసలూ అందుకున్న కృతికి కార్తీక్ ఆర్యన్, టైగర్ ష్రాఫ్, ప్రభాస్‌లలో ఎవర్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు? అనే ప్రశ్న ఎదురైనప్పుడు ఆమె ప్రభాస్‌ను ఎంచుకుంది.
"నేను ప్రభాస్‌ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను" అని చెప్పింది కృతి. అలాగే ఈ ముగ్గురిలో డేటింగ్‌కు టైగర్ ష్రాఫ్‌ను ఎంచుకున్న ఆమె, సరసాలాడ్డానికి కార్తీక్ ఆర్యన్‌ను ఎంచుకుంది. లక్షలాది మంది అమ్మాయిలకు ప్రభాస్ కలల రాకుమారుడు. వాళ్లంతా అతడిని పెళ్లాడాలని కోరుకుంటూ ఉంటారు. కృతి కూడా వాళ్లకు ప్రాతినిధ్యం వహిస్తోందన్న మాట.
'ఆదిపురుష్' మూవీలో వారు అమేజింగ్ పెయిర్‌గా ఆడియెన్స్‌ను అలరిస్తారని మనం ఊహించవచ్చు. ఆ సినిమాలో ఆ ఇద్దరూ కలిసి నటిస్తారంటూ వారి ఫొటోలు బయటకు వచ్చినప్పుడు వారి జంట చూడచక్కగా ఉందనే అభిప్రాయాన్ని అందరూ వ్యక్తం చేశారు. వీఎఫ్ఎక్స్ వర్క్‌కు బాగా ప్రాధాన్యం ఉన్న సబ్జెక్ట్ కావడంతో హాలీవుడ్ బ్లాక్‌బస్టర్స్ 'అవతార్', 'స్టార్ వార్స్' లకు పనిచేసిన వీఎఫ్ఎక్స్ సూపర్‌వైజర్స్‌ను మేకర్స్ సంప్రదించారు. సుమారు రూ. 400 కోట్ల బడ్జెట్‌తో 'ఆదిపురుష్'ను నిర్మిస్తున్నారు. ఈ మూవీలో సైఫ్ అలీఖాన్, సన్నీ సింగ్, అంగద్ బేడీ కీలక పాత్రలు చేస్తున్నారు.
![]() |
![]() |