![]() |
![]() |

మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో ఓ మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీ పాన్ ఇండియా మూవీగా రూపొందనుంది. నేడు (సెప్టెంబర్ 8) ప్రారంభం కానున్న ఈ మూవీ ఫస్ట్ పోస్టర్ ను తాజాగా విడుదల చేసింది చిత్రబృందం.
శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై 50వ చిత్రంగా రానున్న ఈ సినిమాను దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. గురువారం అతిరథమహారథులు మధ్య ఈ మూవీ లాంఛనంగా ప్రారంభం కానుంది. సినిమా ప్రారంభం సందర్భంగా చిత్రయూనిట్ ఆశ్చర్యకరమైన రీతిలో ఫస్ట్ పోస్టర్ ను విడుదల చేసింది. ఈ పోస్టర్ లో హీరో రామ్ చరణ్, హీరోయిన్ కియారా, దర్శకుడు శంకర్, నిర్మాత దిల్ రాజులతో పాటు ఇతర నటీనటులు, టెక్నీషియన్లు సూట్లు ధరించి దర్శనమిస్తున్నారు. గ్రాండ్ గా డిజైన్ చేసిన ఈ పోస్టర్ లో 'వీ ఆర్ కమింగ్' అంటూ క్యాప్షన్ పెట్టారు.
రామ్‌చరణ్ 15వ చిత్రంగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కబోతున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో అంజలి, సునీల్, జయరామ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.
![]() |
![]() |