![]() |
![]() |

`నేర్కొండ పార్వై` వంటి బ్లాక్ బస్టర్ తరువాత కోలీవుడ్ స్టార్ అజిత్, టాలెంటెడ్ డైరెక్టర్ హెచ్. వినోద్ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా `వలిమై`. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ లో హ్యూమా ఖురేషి నాయికగా నటిస్తుండగా.. `ఆర్ ఎక్స్ 100` ఫేమ్ కార్తిక్ గుమ్మకొండ ప్రతినాయకుడిగా దర్శనమివ్వనున్నారు. జూనియర్ మేస్ట్రో యువన్ శంకర్ రాజా బాణీలు అందిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. చిత్రీకరణ తుది దశకు చేరుకున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే.. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ ద్వితీయార్ధంలో `వలిమై`ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని కోలీవుడ్ టాక్. వాస్తవానికి అక్టోబర్ లో గానీ లేదా దీపావళి కానుకగా నవంబర్ 4న గానీ ఈ చిత్రాన్ని విడుదల చే్యబోతున్నట్లు ప్రచారం సాగింది. అనూహ్యంగా క్రిస్మస్ రేస్ లో ఈ సినిమా నిలవనుండడం ఆసక్తి రేకెత్తిస్తోంది.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. ఇదే క్రిస్మస్ బరిలో మిస్టర్ పర్ ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ నటించిన హిందీ చిత్రం `లాల్ సింగ్ చద్ధా`, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పాన్ - ఇండియా మూవీ `పుష్ప` తాలుకూ ఫస్ట్ పార్ట్ `పుష్ప - ద రైజ్` కూడా సందడి చేయబోతున్నాయి. మరి.. ఈ రసవత్తర పోటీలో ఎవరెవరికి విజయాలు దక్కుతాయో చూడాలి.
![]() |
![]() |