![]() |
![]() |

ఒకవైపు కథానాయకుడిగా అలరిస్తూనే.. మరోవైపు ప్రతినాయకుడిగానూ ఎంటర్టైన్ చేస్తున్నారు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి. ప్రస్తుతం సేతుపతి నటిస్తున్న చిత్రాల్లో `విక్రమ్` ఒకటి. లోక నాయకుడు కమల్ హాసన్ టైటిల్ రోల్ లో నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని `ఖైదీ`, `మాస్టర్` చిత్రాల దర్శకుడు లోకేశ్ కనకరాజ్ తెరకెక్కిస్తున్నారు. ఇందులో కమల్ తో పాటు ఫహద్ ఫాజిల్, విజయ్ సేతుపతి ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఫహద్, సేతుపతి.. ఇద్దరు కూడా నెగటివ్ రోల్స్ లో కనిపిస్తారని బజ్.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో విజయ్ సేతుపతి ముచ్చటగా ముగ్గురు ముద్దుగుమ్మలతో రొమాన్స్ చేయబోతున్నారట. టీవీ యాక్ట్రస్ శివానితో పాటు మైనా నందిని, మహేశ్వరి అనే మరో ఇద్దరు భామలు.. `విక్రమ్`లో విజయ్ సేతుపతి సరసన దర్శనమిస్తారట. అంతేకాదు.. ఈ ముగ్గురి పాత్రలు కూడా నెగటివ్ షేడ్స్ తోనే ఉంటాయని.. సినిమాలో వీరి పాత్రలు కూడా కీలకమని కోలీవుడ్ టాక్. మరి.. `విక్రమ్`కి విజయ్ సేతుపతి రొమాన్స్ ట్రాక్ ఏ మేరకు ప్లస్ అవుతుందో చూడాలి.
ఆర్. మహేంద్రన్ తో కలిసి కమల్ హాసన్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న `విక్రమ్`కి అనిరుధ్ బాణీలు అందిస్తున్నాడు. 2022 ఆరంభంలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ థియేటర్స్ లో సందడి చేసే అవకాశముంది.
![]() |
![]() |