![]() |
![]() |
.jpg)
మూవీ ఆర్టిస్ట్స్ ఆసోసియేషన్ (మా) చేయాల్సిన పనులు చాలా ఉన్నాయనీ, అయితే అన్నింటికంటే 'మా' బిల్డింగే ముఖ్యమనుకుంటే ఎన్నికల్లో మెంబర్స్ విష్ణుగారినే గెలిపిస్తారేమోనని వ్యాఖ్యానించారు సీనియర్ యాక్టర్ ప్రకాశ్‌రాజ్. మా బిల్డింగ్‌ను తానొక్కడే కట్టేంత డబ్బు తన దగ్గర లేదని ఆయన అన్నారు. అక్టోబర్‌లో మా ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తన ప్యానల్‌ను అధికారికంగా ప్రకటించడానికి శుక్రవారం సాయంత్రం ఎఫ్ఎన్‌సీసీలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు ప్రకాశ్‌రాజ్. ఆ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆయన జవాబులిచ్చారు.
విష్ణు 'మా' భవనం కట్టిస్తానని ప్రకటించారు కదా, మీరేం చేస్తారనే ప్రశ్న ఎదురైనప్పుడు, "ఇన్ని సంవత్సరాల నుంచి లేని మా భవనం కావాలని విష్ణుగారు అన్నారు. అది చాలా మంచి విషయమే. నన్నడిగితే అదొకటే కాదు, చాలా విషయాలున్నాయి. ఆయన ప్రణాళికలు చెప్పారు. నా ప్రణాళికలు చెప్తాను. ఉన్న అందరు మెంబర్స్ అన్నిటికంటే మా భవనమే ముఖ్యమనుకుంటే ఆయన్నే గెలిపిస్తారేమో. ఫైనల్లీ మెంబర్స్.. విష్ణుగారు మాట్లాడుతున్నారు, ప్రకాశ్‌రాజ్‌గారు మాట్లాడుతున్నారు.. వీళ్లు మాట్లాడుతున్నది మాకు కావాలి, ఇది ఇంపార్టెంట్ అనిపిస్తే వాళ్లకు ఓటేస్తారు. మెంబర్స్‌కు ఏం కావాలనేది ఓటు డిసైడ్ చేస్తుంది." అని చెప్పారు.
"నేను మూడు స్థలాల్ని వెతకలేను. నా దగ్గర అంత డబ్బు లేదు. నేను ఒక్కడ్నే కట్టేంత డబ్బు నా దగ్గర లేదు. నేను చాలా స్మాల్ ఆర్టిస్టును. నా భవనం ఐడియా చాలా విశాలమైంది. దానికి చాలా డబ్బు కావాలి. నాకు వేరే పనులున్నాయి. అవేమిటనేది నా ప్రణాళికలు చెప్పేటప్పుడు చెప్తాను. తమకు భవనం కావాలని మెంబర్స్ అనుకుంటే ఆయన్నే ఎన్నుకుంటారు. చాలా సింపుల్. మెంబర్స్ వాళ్లకేం కావాలో ఇచ్చేవాళ్లనే ఎన్నుకుంటారు. వాళ్లనే డిసైడ్ చేసుకోనివ్వండి." అన్నారు ప్రకాశ్‌రాజ్.
![]() |
![]() |