![]() |
![]() |

నేచురల్ స్టార్ నాని, రీతు వర్మ జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన సినిమా 'టక్ జగదీష్'. వినాయకచవితి కానుకగా సెప్టెంబరు 10 నుంచి ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. రీసెంట్ గా విదుదలైన మూవీ ట్రైలర్ కు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఇక తాజాగా ఈ మూవీ నుంచి ఓ బిట్ సాంగ్ విడుదలైంది.
'టక్ సాంగ్' పేరుతో 'టక్ జగదీష్' నుంచి ఓ బిట్ సాంగ్ ను శుక్రవారం విడుదల చేశారు మేకర్స్. 'సల్లాటి కుండలో.. సల్ల సక్క మనసు వాడు' అంటూ సాగే ఈ పాట ఆకట్టుకుంటోంది. గోపి సుందర్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ కి డైరెక్టర్ శివ నిర్వాణ లిరిక్స్ అందించారు. గతంలో మజిలీ సినిమాలోని 'ఏడెత్తు మల్లెలే' సాంగ్ కి లిరిక్స్ అందించి ఆకట్టుకున్న శివ.. మరోసారి లిరిక్ రైటర్ గా మెప్పించారు. టక్ జగదీష్ క్యారెక్టరైజేషన్ ని తెలియజేస్తూ ఆయన రాసిన లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ సాంగ్ ని కూడా స్వయంగా ఆయనే పాడటం విశేషం.
'టక్ సాంగ్' లిరికల్ వీడియోలో ముందుగా నాని, మ్యూజిక్ డైరెక్టర్, డైరెక్టర్ మధ్య ఆసక్తికరమైన సంభాషణను పెట్టారు. మ్యూజిక్ డైరెక్టర్, డైరెక్టర్ ముందుగా ఈ సాంగ్ ని నాని చేత పాడించాలని అనుకుంటారు. నాని సాంగ్ పాడటానికి ఒప్పుకుంటారా అని మ్యూజిక్ డైరెక్టర్ అడగగా.. నేను ఒప్పిస్తాను అంటూ డైరెక్టర్.. ఆయనను నాని దగ్గరకు తీసుకొస్తారు. అయితే నాని ఎలా పాడాలో చూపించండి అని అడగగా.. శివ రెండు లైన్స్ పాడి వినిపిస్తారు. సేమ్ ఇలాగే పాడాలా? అయితే మీరే పాడండి అంటూ నాని.. శివ చేతనే పాడిస్తారు.
![]() |
![]() |