![]() |
![]() |

పవన్ కల్యాణ్ టైటిల్ రోల్ చేస్తోన్న 'భీమ్లా నాయక్' మూవీ కాంట్రవర్సీలో చిక్కుకుంటోంది. పవర్‌స్టార్ బర్త్‌డే సందర్భంగా ప్రొడ్యూసర్స్ రిలీజ్ చేసిన టైటిల్ సాంగ్‌లో ఉన్న పదబంధంపై తెలంగాణకు చెందిన రమేశ్ అనే ఐపీఎస్ ఆఫీసర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. గేయరచయిత రామజోగయ్య శాస్త్రిపై వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. లేటెస్ట్‌గా 'భీమ్లా నాయక్' మూవీ ద్వారా ఎస్టీలకూ, క్రిస్టియన్లకూ మధ్య త్రివిక్రమ్ సాంస్కృతిక వైరుధ్యాన్ని సృష్టిస్తున్నారంటూ దళిత బహుజన రచయితలు ఆరోపిస్తున్నారు.
నిన్నటికి నిన్న అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన 'అల.. వైకుంఠపురములో' మూవీలో చెడ్డపాత్రకు వాల్మీకి అనే పేరు పెట్టడంపై పలువురు రచయితలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. త్రివిక్రమ్ ఉద్దేశపూర్వకంగానే హీరో అసలు తండ్రికి రామచంద్ర అనీ, చెడ్డవాడైన పెంపుడుతండ్రికి వాల్మీకి అనీ పేర్లు పెట్టారని దళిత బహుజన రచయితలు ఆరోపించారు.
ఇప్పుడు 'భీమ్లా నాయక్'కు రైటర్ అయిన త్రివిక్రమ్ మరోసారి అదే తరహాలో ఈ సినిమాలోని పాత్రలకు ఉద్దేశపూర్వంగానే పేర్లు పెట్టారని ప్రముఖ దళిత కవి డాక్టర్ నూకతోటి రవికుమార్ ఆరోపించారు. మలయాళంలో ఘనవిజయం సాధించిన 'అయ్యప్పనుమ్ కోషియుమ్'కు 'భీమ్లా నాయక్' రీమేక్. క్రియేటివ్ కాషాయంలో త్రివిక్రమ్ విషం పంచుతున్నారని రవికుమార్ తీవ్రంగా దుయ్యబట్టారు. 'భీమ్లా నాయక్'లో విలన్లకు క్రిస్టియన్ పేరు్ల పెట్టడం దీనికి నిదర్శనంగా ఆయన పేర్కొన్నారు.
"ఇది 'భీమ్లా నాయక్' సినిమా హీరో గురించిన ముచ్చట కాదు. 'క్రియేటివ్ కాషాయం'లో త్రివిక్రముడు పంచే విషం గురించిన చింత. 'అయ్యప్పనుమ్ కోషియుమ్' మలయాళ మూవీలో లేని అన్వయాన్ని ఎంచుకున్న 'పేర్ల' ద్వారా ఇందులో చెప్పడంతో చేసే విష బీజాల వ్యాప్తి గురించిన చింత. హీరో నాయక్ తెలుగు 'భీమ్లా నాయక్'లో విలన్ల పేర్లు జాన్ ...తదితర క్రిస్టియన్ నేమ్స్ పెట్టడం. వీధి బాలలు క్రిమినల్స్ అవుతారని కుటుంబం గొప్పతనం 'అతడు'గా చాటే త్రివిక్రమ్ ఇప్పుడు ఒక పర్వేర్టెడ్ పోలీస్ అధికారికి నాయక్ అని పేరు పెట్టి ఎస్టీలకి, క్రిస్టియన్ కి మధ్య ఒక గట్టి వైరుధ్యాన్ని' 'సాంస్కృతికం'గా సృష్టించడం లక్ష్యంగా ఎంచుకోవడానికి లోపలి కారణాలని మనం అవగాహన చేసుకుంటూ వుండాలి. కరసేవకులకి 'సేవ' చేయడానికి ఈ మాత్రం 'సాంస్కృతిక వైషమ్యం' సృష్టించాలి. మనం నేర్చుకోమ్. ఎవడేనా నేర్పినా తిరస్కరిస్తాం. ఓకేళ తప్పక పట్టించుకోవాల్సి వస్తే తప్పుడు అన్వయం చేస్తాం. మీరోసారి సినిమాల్లో విలన్ల పేర్లు, వాడుతున్న భాష గమనిస్తే.. శ్రామిక కులాలని, మైనారిటీ మతాలని అవహేళన చేయడం ద్వారా సాంస్కృతిక విషం వ్యాప్తి చేయడం అనేది ప్రణాళికా బద్దంగా చేసే పనిగా మనకు స్పష్టపడుతుంది." అని తన ఫేస్‌బుక్ హ్యాండిల్‌లో రవికుమార్ రాసుకొచ్చారు.


![]() |
![]() |