![]() |
![]() |

అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీ హిట్ కొట్టిన తేదిని.. తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసుకున్నారు. మరి.. అన్నయ్య లాగే తమ్ముడు కూడా సెన్సేషన్ క్రియేట్ చేస్తారా?
కాస్త వివరాల్లోకి వెళితే.. పవన్ కళ్యాణ్ తన కెరీర్ లోనే తొలిసారిగా చేస్తున్న హిస్టారికల్ ఫిక్షన్ డ్రామా `హరిహర వీరమల్లు`. మొఘలాయిల కాలం నాటి వాతావరణంతో రూపొందుతున్న ఈ పిరియడ్ డ్రామాలో రాబిన్ హుడ్ తరహా పాత్రలో దర్శనమివ్వనున్నారు పవన్. వెర్సటైల్ కెప్టెన్ క్రిష్ రూపొందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో పవన్ కి జతగా నిధి అగర్వాల్ నటిస్తుండగా.. స్వరవాణి కీరవాణి బాణీలు అందిస్తున్నారు. పాన్ - ఇండియా మూవీగా తయారవుతున్న ఈ సినిమాని 2022 ఏప్రిల్ 29న విడుదల చేయబోతున్నట్లు పవన్ బర్త్ డే స్పెషల్ గా అనౌన్స్ చేశారు. ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. 1988లో ఇదే ఏప్రిల్ 29న మెగాస్టార్ చిరంజీవి నటించిన `యముడికి మొగుడు` రిలీజై అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.
మరి.. అన్నయ్య చిరు `ఇండస్ట్రీ హిట్` డేట్ ని టార్గెట్ చేసుకున్న తమ్ముడు పవన్.. ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాలి.
![]() |
![]() |