![]() |
![]() |

`భీష్మ` వంటి సక్సెస్ ఫుల్ మూవీ తరువాత వచ్చిన `చెక్`, `రంగ్ దే` చిత్రాలు ఆశించిన ఫలితాలను అందుకోకపోవడంతో.. రాబోయే `మాస్ట్రో`పైనే ఆశలు పెట్టుకున్నాడు యూత్ స్టార్ నితిన్. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ `అంధాధున్`కి రీమేక్ గా రూపొందిన ఈ బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్.. కరోనా ఎఫెక్ట్ తో థియేటర్స్ లో కాకుండా ఓటీటీలో నేరుగా స్ట్రీమ్ కాబోతోంది. ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ ప్లస్ హాట్ స్టార్.. సెప్టెంబర్ 17న ఈ చిత్రాన్ని స్ట్రీమ్ చేస్తోంది.
కాగా, సెంటిమెంట్ పరంగా చూస్తే.. నితిన్ కి సెప్టెంబర్ 17 అన్ లక్కీ డేట్. ఎందుకంటే.. ఆరేళ్ళ క్రితం ఇదే తేదిన నితిన్ టైటిల్ రోల్ లో నటించిన `కొరియర్ బాయ్ కళ్యాణ్` విడుదలై నిరాశపరిచింది. మళ్ళీ ఇప్పుడు అదే తేదికి `మాస్ట్రో` స్ట్రీమ్ కాబోతోంది. అంతేకాదు.. నితిన్ సెప్టెంబర్ ట్రాక్ రికార్డ్ కూడా పెద్ద గొప్పగా ఏమీ లేదు. `సై`, `అల్లరి బుల్లోడు`, `రెచ్చిపో`, `కొరియర్ బాయ్ కళ్యాణ్`.. ఇలా సెప్టెంబర్ లో సందడి చేసిన నితిన్ చిత్రాల్లో `సై` మాత్రమే సక్సెస్ ఫుల్ వెంచర్ అనిపించుకుంది. మిగిలిన మూడు చిత్రాలు కూడా డిజప్పాయింట్ చేశాయి. ఈ నేపథ్యంలో.. `మాస్ట్రో` ఫలితంపై ఆసక్తి నెలకొంది. మరి.. ప్రచార చిత్రాలతో ఇంప్రెస్ చేసిన `మాస్ట్రో`.. నితిన్ అన్ లక్కీ డేట్ ని కాస్త లక్కీ డేట్ గా మలుస్తుందేమో చూడాలి.
![]() |
![]() |