![]() |
![]() |
.jpg)
అక్కినేని నాగచైతన్య కథానాయకుడిగా నటించిన `ఒక లైలా కోసం` చిత్రంతో తెలుగులో నేరుగా ఎంట్రీ ఇచ్చింది పూజా హెగ్డే. ఆ సినిమా ఆశించిన విజయం సాధించకపోయినా.. కాలక్రమంలో వరుస హిట్స్ తో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది ఈ గ్లామర్ క్వీన్. కట్ చేస్తే.. ఏడేళ్ళ తరువాత అక్కినేని కాంపౌండ్ లో మరో సినిమా చేస్తోంది పూజా హెగ్డే. అదే.. `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్`. ఇందులో చైతూ తమ్ముడు అక్కినేని అఖిల్ తో రొమాన్స్ చేసింది పూజ. విజయదశమి కానుకగా అక్టోబర్ 8న ఈ సినిమా విడుదల కానుంది.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. చైతూకి జోడీగా పూజ నటించిన `ఒక లైలా కోసం` కూడా 2014లో ఇదే అక్టోబర్ నెలలో విడుదలైంది. మళ్ళీ ఇప్పుడు సేమ్ మంత్ లో అఖిల్ తో ఆడిపాడిన `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్` రిలీజ్ కాబోతోంది. మరి.. అప్పుడు వర్కవుట్ కాని అక్టోబర్.. ఈ సారైనా అక్కినేని కాంపౌండ్ విషయంలో పూజకి కలిసొస్తుందేమో చూడాలి. ఏదేమైనా.. అక్కినేని యంగ్ హీరోలతో పూజ జట్టుకట్టిన రెండు సందర్భాల్లోనూ అక్టోబర్ లోనే ఆయా సినిమాలు విడుదలవడం విశేషమనే చెప్పాలి.
![]() |
![]() |