![]() |
![]() |

నేడు(సెప్టెంబర్ 2) పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. దీంతో ఈరోజు ఫ్యాన్స్ కు వరుస సర్‌ప్రైజ్‌లు అందుతున్నాయి. ఇప్పటికే 'భీమ్లా నాయక్' టైటిల్ సాంగ్ విడుదలై ఆకట్టుకుంటోంది. అలాగే పవన్, డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్ లో వస్తున్న 'హరిహర వీరమల్లు' చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 29న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక ఇప్పుడు పవన్ నటిస్తున్న 29వ మూవీ కాన్సెప్ట్ పోస్టర్ విడుదలైంది.
పవన్ తన 29వ చిత్రాన్ని సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేస్తున్నారు. రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్ ను పవన్ బర్త్ డే కానుకగా తాజాగా విడుదల చేశారు. పోస్టర్ పై ఉన్న 'యథా కాలమ్.. తథా వ్యవహారమ్’అనే స్లోగన్ ఆకట్టుకుంటుంది. పోస్టర్ లో గన్ ను, హైదరాబాద్ లోని చార్మినార్, సైబర్ టవర్ ను చూపించడం ఆసక్తికరంగా ఉంది. కాన్సెప్ట్ పోస్టర్ తోనే మూవీపై అంచనాలు పెంచేశారు.

'వకీల్ సాబ్'తో రీఎంట్రీ ఇచ్చి ఆకట్టుకున్న పవన్.. వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. సాగర్ చంద్ర దర్శకత్వంలో 'భీమ్లా నాయక్', క్రిష్ దర్శకత్వంలో 'హరిహర వీరమల్లు'తో పాటు.. సురేందర్ రెడ్డి, హరీష్ శంకర్ ప్రాజెక్ట్స్ లైన్ లో ఉన్నాయి.
![]() |
![]() |