![]() |
![]() |

రాతలోనూ, తీతలోనూ దర్శకరచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ తీరే వేరు. అందుకే.. అగ్ర కథానాయకుల కాంబినేషన్స్ లోనే ఆయన కెరీర్ యమ సక్సెస్ ఫుల్ గా ముందుకు సాగుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేశ్ బాబు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వంటి టాప్ స్టార్స్ అయితే త్రివిక్రమ్ తో మళ్ళీ మళ్ళీ సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ మధ్యే పవన్, బన్నీతో మూడో రౌండ్ వేసిన త్రివిక్రమ్.. ప్రస్తుతం మహేశ్ తో అదే రూట్ లో వెళుతున్నారు.
`అతడు`, `ఖలేజా` తరువాత మహేశ్ బాబుతో త్రివిక్రమ్ చేయబోతున్న మూడో సినిమా.. అతి త్వరలో రెగ్యులర్ షూటింగ్ కి వెళ్ళనుంది. కథానాయకుడిగా మహేశ్ కి ఇది 28వ సినిమా. గమనించదగ్గ విషయం ఏంటంటే.. గతంలో ఇదే నంబర్ దగ్గర ఉన్నప్పుడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్.. త్రివిక్రమ్ కాంబినేషన్ లో `అరవింద సమేత` చేశాడు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించడమే కాకుండా.. తారక్ కెరీర్ లో హయ్యస్ట్ గ్రాసర్ గా నిలిచింది. మరి.. ఎన్టీఆర్ 28కి అచ్చొచ్చిన త్రివిక్రమ్ ఫ్యాక్టర్.. మహేశ్ 28కి కూడా వర్కవుట్ అయి సూపర్ స్టార్ కెరీర్ లో మరో హయ్యస్ట్ గ్రాసర్ చేరుతుందేమో చూడాలి.
కొసమెరుపు ఏమిటంటే.. `ఎన్టీఆర్ 28` నాయిక పూజా హెగ్డే, స్వరకర్త తమన్, నిర్మాణ సంస్థ హారికా అండ్ హాసిని క్రియేషన్స్.. `మహేశ్ 28`కి కూడా కొనసాగుతున్నారు.
![]() |
![]() |