![]() |
![]() |

పేరుకి తెలుగమ్మాయే అయినా.. తమిళనాటే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఐశ్వర్యా రాజేశ్. యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ హీరోగా నటించిన `వరల్డ్ ఫేమస్ లవర్`తో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఐశ్వర్య.. త్వరలో ముచ్చటగా మూడు సినిమాలతో పలకరించబోతోంది.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. ఈ మూడు చిత్రాలు కూడా పండగ సమయాల్లోనే సందడి చేయబోతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే.. నేచురల్ స్టార్ నానికి జంటగా ఐశ్వర్య నటించిన `టక్ జగదీష్`.. వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 10న ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది. ఇందులో రీతూ వర్మ మెయిన్ లీడ్ గా నటించగా.. ఐశ్వర్య సెకండ్ లీడ్ గా చేసింది. ఇక విజయదశమి సీజన్ లో `రిపబ్లిక్` చిత్రంతో పలకరించబోతోంది ఐశ్వర్య. `సుప్రీమ్` హీరో సాయితేజ్ నటించిన ఈ పొలిటికల్ డ్రామా అక్టోబర్ 1న థియేటర్స్ లో సందడి చేయనుంది. అలాగే సంక్రాంతి కానుకగా రాబోతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ `భీమ్లా నాయక్`లోనూ ఐశ్వర్య ముఖ్య పాత్ర పోషించింది. ఇందులో మరో హీరోగా నటిస్తున్న రానా దగ్గుబాటికి జంటగా ఐశ్వర్య కనిపించనుంది.
మరి.. ఫెస్టివల్ స్పెషల్స్ గా రానున్న ఆయా చిత్రాలతో ఐశ్వర్యా రాజేశ్ ఎలాంటి ఫలితాలను, గుర్తింపును పొందుతుందో చూడాలి.
![]() |
![]() |