![]() |
![]() |

కింగ్ నాగార్జునకి అచ్చొచ్చిన సంగీత దర్శకుల్లో అనూప్ రూబెన్స్ ఒకరు. తన తండ్రి, నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు, తనయులు నాగచైతన్య, అఖిల్ కాంబినేషన్ లో నాగ్ చేసిన మెమరబుల్ మూవీ `మనం`కి అనూప్ నే స్వరకర్త. అలాగే నాగ్ కెరీర్ లో హయ్యస్ట్ గ్రాసర్ గా నిలిచిన 2016 నాటి సంక్రాంతి బ్లాక్ బస్టర్ `సోగ్గాడే చిన్ని నాయనా`కి కూడా అనూప్ అందించిన బాణీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
అలాంటి.. అనూప్ కాంబినేషన్ లో ముచ్చటగా మూడో సినిమా చేస్తున్నారు నాగ్. ఆ చిత్రమే.. `బంగార్రాజు`. `సోగ్గాడే చిన్ని నాయనా`కి సీక్వెల్ గా రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో నాగ్ తో పాటు చైతూ కూడా మరో హీరోగా నటిస్తున్నాడు. కళ్యాణ్ కృష్ణ డైరెక్ట్ చేస్తున్న ఈ సోషియో ఫాంటసీ.. ఇటీవలే రెగ్యులర్ షూటింగ్ బాట పట్టింది. చకచకా చిత్రీకరణ పూర్తి చేసి.. 2022 సంక్రాంతికి విడుదల చేయాలని నాగ్ ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు.. `మనం`, `సోగ్గాడే చిన్ని నాయనా` తరహాలో `బంగార్రాజు` కూడా నాగార్జున హోమ్ బేనర్ అన్నపూర్ణ స్టూడియోస్ పైనే నిర్మితమవుతుండడం విశేషం. మరి.. నాగ్ తో అనూప్ చేస్తున్న ఈ మూడో ప్రయత్నం హ్యాట్రిక్ హిట్ ని అందిస్తుందేమో చూడాలి.
![]() |
![]() |