![]() |
![]() |

కోలీవుడ్ ప్రముఖ నటి, స్టార్ హీరో సూర్య సతీమణి జ్యోతిక ఇన్‌స్టాగ్రామ్ లో అడుగు పెట్టారు. మొదటి పోస్ట్ లో హిమాలయాలలో దిగిన ఫోటోలను షేర్ చేసిన ఆమె.. ట్రిప్ కి సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకున్నారు.

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న జ్యోతిక హిమాలయ పర్వతాలకు వెళ్లారు. చేతిలో జాతీయ జెండాను పట్టుకుని ఆమె ఓ ఫొటో తీసుకున్నారు. బికాత్ అడ్వెంచర్స్ టీమ్‌లోని సభ్యులతో కలిసి కశ్మీర్ సరస్సులను సందర్శించారు. మొదటిసారిగా సోషల్ మీడియాలో.. నా లాక్డౌన్ డైరీల నుండి కొన్ని ఫొటోలు అంటూ ఆమె సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేశారు. 'భారతదేశం చాలా అందంగా ఉంది! జై హింద్!' అంటూ ఆమె పోస్ట్ లో పేర్కొన్నారు. ఆమె షేర్ చేసిన ఫొటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

జ్యోతిక తొలి పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే 1.4 మిలియన్లకు పైగా ఫాలోవర్లను సంపాదించుకున్నారు. ఆమె మొదటి పోస్ట్ కు దాదాపు 4 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి.
![]() |
![]() |