![]() |
![]() |
.jpg)
`భరత్ అనే నేను`, `వినయ విధేయ రామ` చిత్రాలతో తెలుగువారిని ఆకట్టుకున్న ఉత్తరాది సోయగం.. కియారా అద్వాని. బాలీవుడ్ లో తనదైన శైలిలో దూసుకుపోతున్న ఈ యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్ట్రస్.. `అర్జున్ రెడ్డి` రీమేక్ `కబీర్ సింగ్`తో సెపరేట్ ఫ్యాన్ బేస్ ని సొంతం చేసుకుంది. ఇక రీసెంట్ గా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అయిన `షేర్షా` కూడా కియారాకి మంచి పేరుని తీసుకువచ్చింది.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. కియారా అద్వానికి బయోపిక్స్ భలేగా కలిసొస్తున్నాయి. తన కెరీర్ ఆరంభంలో చేసిన `ఎం.ఎస్. ధోని: ద అన్ టోల్డ్ స్టోరి` క్రికెట్ వీరుడు ఎం.ఎస్. ధోని జీవితం ఆధారంగా రూపొంది కియారాకి తొలి విజయాన్ని అందివ్వగా.. కార్గిల్ యుద్ధ వీరుడు కెప్టెన్ విక్రమ్ బాత్రా జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన `షేర్షా` ఇటీవల ట్రాక్ తప్పిన తన కెరీర్ ని మళ్ళీ సక్సెస్ రూట్ లోకి తీసుకువచ్చింది. అంతేకాదు.. అమెజాన్ ప్రైమ్ లో అత్యధికులు వీక్షించిన భారతీయ చిత్రంగా `షేర్షా` సరికొత్త చరిత్రని లిఖించింది కూడా. మొత్తమ్మీద.. బయోపిక్స్ లో భాగమవడం కియారాకి ప్లస్ అవుతోందనే చెప్పాలి. మరి.. రాబోయే కాలంలోనూ కియారా ఈ పరంపరని కొనసాగిస్తుందేమో చూడాలి.
![]() |
![]() |