![]() |
![]() |

నాగశౌర్య, రీతు వర్మ జంటగా నటిస్తున్న చిత్రం 'వరుడు కావలెను'. ఈ సినిమాతో లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయమవుతున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్స్, సాంగ్స్ కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా మూవీ టీజర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం.
'వరుడు కావలెను' మూవీ టీజర్ మంగళవారం విడుదలైంది. సింపుల్ అండ్ బ్యూటిఫుల్ అన్నట్లుగా ఉన్న టీజర్ ఆకట్టుకుంటోంది. 'అమ్మా.. వీళ్లెవరు నాకు కనెక్ట్ అవ్వట్లేదే' అంటూ రీతు చెప్పే డైలాగ్ తో టీజర్ ప్రారంభమైంది. అందం, పొగరు కలగలిసిన రితుని ప్రేమలో పడేయడానికి నాగశౌర్య పడుతున్న పాట్లను టీజర్ లో క్యూట్ గా చూపించారు. ఇక టీజర్ ఎండ్ లో 'ఎవ్రీ బాల్ సిక్స్ కొట్టే బ్యాట్‌మెన్ ని చూశావా.. మా వాడు కొడతాడు. ప్రతి బాల్ నోబాల్ అని ఇచ్చే అంపైర్‌ని చూశావా.. ఆవిడ ఇస్తది' అంటూ శౌర్య, రీతులను ఉద్దేశించి చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటోంది. మొత్తానికి శౌర్య, రీతుల లుక్స్, డైలాగ్స్, బ్యూటిఫుల్ మ్యూజిక్ తో టీజర్ మెప్పించేలా ఉంది.
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకున్న ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
![]() |
![]() |