![]() |
![]() |

నటుడిగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన బండ్ల గణేష్.. ఆ తర్వాత నిర్మాతగా మారి రాణించాడు. 'ఆంజనేయలు' సినిమాతో నిర్మాతగా మారిన బండ్ల.. తీన్మార్, గబ్బర్ సింగ్, బాద్ షా, టెంపర్ వంటి సినిమాలను నిర్మించాడు. ఎన్టీఆర్ నటించిన 'టెంపర్' తర్వాత మళ్ళీ సినిమాలేవీ నిర్మించని ఆయన.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో సినిమా ఓ చేయాలని ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఇదిలా ఉంటే టెంపర్ సమయంలో తారక్, బండ్ల మధ్య మనస్పర్థలు వచ్చాయని ప్రచారం జరిగింది. అయితే తాజాగా దీనిపై బండ్ల క్లారిటీ ఇచ్చారు.
తారక్ తో బండ్ల గణేష్ బాద్ షా, టెంపర్ మూవీస్ నిర్మించాడు. టెంపర్ మూవీ సమయంలో రెమ్యునరేషన్ విషయంలో తారక్ కి బండ్ల తో గొడవ జరిగినట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. తారక్, బండ్ల మధ్య మనస్పర్థలు వచ్చాయని వార్తలొచ్చాయి. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బండ్ల ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. అన్నదమ్ముల మధ్య చిన్న చిన్న మనస్పర్థలు వస్తూనే ఉంటాయి. దానిని గొడవ అనలేం. మిస్ కమ్యూనికేషన్ వలన ఏదో జరిగిపోయింది. ఎన్టీఆర్ తో నాకు ఎలాంటి గొడవా లేదు అని బండ్ల చెప్పుకొచ్చాడు.
ప్రొడ్యూసర్ గా మళ్ళీ బిజీగా మారాలని చూస్తున్న బండ్ల.. తారక్ తో ఎలాంటి గొడవా లేదని చెప్పడం చూస్తుంటే.. తారక్ తో మరో సినిమా చేయాలని చూస్తున్నాడేమో అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి 'ఆర్ఆర్ఆర్' తర్వాత వరుస పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కమిట్ అవుతున్న తారక్.. బండ్లకి అవకాశమిస్తారేమో చూడాలి.
![]() |
![]() |