![]() |
![]() |

పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రధారులుగా సాగర్ చంద్ర దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'భీమ్లా నాయక్'. మలయాళ సూపర్ హిట్ మూవీ 'అయ్యప్పనుమ్ కోషియుమ్'కి రీమేక్ గా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో భీమ్లా నాయక్ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవన్ కనిపించనున్నాడు. ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన వీడియో పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక తాజాగా ఈ సినిమా ఫస్ట్ సింగిల్ అప్డేట్ వచ్చింది.
పవన్ పుట్టినరోజు(సెప్టెంబర్ 2) సందర్భంగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ పేరుతో టైటిల్ సాంగ్ ను విడుదల చేయనున్నట్లు తాజాగా మేకర్స్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. సెప్టెంబర్ 2 ఉదయం 11:16 గంటలకు టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేయనున్నట్టు తెలుపుతూ తాజాగా ఒక పోస్టర్ ను విడుదల చేశారు.

కాగా, ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ మూవీలో పవన్ సరసన నిత్యామీనన్ నటిస్తుండగా, రానా సరసన ఐశ్వర్య రాజేష్ నటిస్తోంది. సంక్రాంతి కానుకగా 2022 జనవరి 12న ఈ సినిమా విడుదల కానుంది.
![]() |
![]() |