![]() |
![]() |

ఏ సినిమా అయినా కేవలం ఫ్యాన్స్ చూసినంత మాత్రాన సినిమాలు హిట్టు కావనీ, మిగతా ప్రేక్షకులు కూడా చూస్తేనే హిట్టవుతాయనీ హీరో సుధీర్‌బాబు అభిప్రాయపడ్డాడు. ఆయన లేటెస్ట్ ఫిల్మ్ 'శ్రీదేవి సోడా సెంటర్' ఇటీవల థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్‌తో నడుస్తోంది. ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కృష్ణ, మహేశ్ సినిమాల ఇన్‌ఫ్లుయెన్స్ ఏమైనా ఆయనపై ఉందా అనే ప్రశ్న ఎదురైంది.
"కృష్ణగారు, మహేశ్ తమ కెరీర్‌లలో ఎంతో సాధించారు. నావరకు అలాంటివి కలల్లోనే సాధ్యమవుతుంది. ప్రస్తుతానికి మనమేంటనేది చూసుకుంటూ ముందుకెళ్లాలి. గ్రౌండ్ రియాలిటీలో నేను బతుకుతాను. అదే సమయంలో వాళ్లు చేసిన సినిమాలను ఒక కేస్ స్టడీలాగా చూస్తాను." అని చెప్పాడు సుధీర్. కెరీర్‌లో మహేశ్ ఎట్లాంటి సినిమాలు చేశాడు, కృష్ణగారు ఎలాంటి సినిమాలు చేశారనేది ఒక కేస్ స్టడీలాగా చూస్తానని అతనన్నాడు. వాళ్లు చేశారు కాబట్టి తాను కూడా అవే చేయాలని ఎప్పుడూ అనుకోనని స్పష్టం చేశాడు సుధీర్.
"మహేశ్ ఏం చేశాడో నేనూ అదే చేయడం కరెక్ట్ కాదు. నాకంటూ సపరేట్ సెటప్ ఆడియెన్స్‌ను సంపాదించుకోవాలి." అన్న అతను, "ఫ్యాన్స్ చూస్తేనే సినిమాలు హిట్టయిపోవండీ. ఫ్యాన్స్ కాకుండా వేరే ఆడియెన్స్ చూస్తేనే సినిమాలు హిట్టవుతాయనేది నా ఫీలింగ్. ఫ్యాన్స్‌తో పాటు మిగతా ఆడియెన్స్ చూస్తేనే బిగ్ స్టార్ అవుతారు." అని చెప్పుకొచ్చాడు.
'శ్రీదేవి సోడా సెంటర్'లో లైటింగ్ సూరిబాబు క్యారెక్టర్‌లో సుధీర్ ప్రదర్శించిన అభినయం ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటోందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
![]() |
![]() |