![]() |
![]() |

ఆర్జీవీ డైరెక్ట్ చేసిన ఒక హారర్ మూవీలో నటించాలని ఆశపడ్డ బిగ్ బాస్ 4 ఫేమ్ సయ్యద్ సొహేల్ ర్యాన్ ఆడిషన్స్‌లో విఫలమయ్యాడు. ఈ విషయాన్ని సొహేల్ స్వయంగా తెలిపాడు. లేటెస్ట్‌గా జరిగిన 'డియర్ మేఘ' మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్‌లో సొహేల్ మాట్లాడుతూ ఈ నిజాన్ని బయటపెట్టాడు. ఈ ఈవెంట్‌కు రామ్‌గోపాల్ వర్మ చీఫ్ గెస్ట్‌గా వచ్చారు. అదిత్ అరుణ్, మేఘా ఆకాశ్ జంటగా నటించిన సినిమా 'డియర్ మేఘ'. సుశాంత్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ మూవీని అర్జున్ దాస్యం నిర్మించారు.
ఆర్జీవీని రెండోసారి ఈ ఈవెంట్‌లో కలిశానని చెప్పిన సొహేల్, తొలిసారి ఓ హారర్ మూవీ ఆడిషన్స్ సందర్భంగా కలిశానని వెల్లడించాడు. అప్పుడు తానింకా చిన్నపిల్లాడిననీ, ఆ సినిమా ఆఫర్ రాలేదనీ చెప్పాడు. అప్పటికి తనకింకా మెచ్యూరిటీ రాలేదని సొహేల్ తెలిపాడు. ఈలోపు స్టేజి ముందు కూర్చొని ఉన్న ఆర్జీవీ ఏదో చెప్పడంతో "ఇప్పుడింక డైలాగ్ చెప్పకండి సార్.. పంచ్.. బయమైతంది" అన్నాడు సొహేల్.
కాగా, ఏ హారర్ మూవీ ఆడిషన్‌కు తాను వెళ్లాననే విషయం సొహేల్ వెల్లడించలేదు. అప్పటికి సొహేల్ ఎవరో ఆర్జీవీకి తెలియదు కాబట్టి ఆ ఆఫర్ వచ్చివుండదని అనుకోవాలి. ఇప్పుడైతే తప్పకుండా చాన్స్ ఇచ్చివుండేవారేమో!
![]() |
![]() |