![]() |
![]() |

తెలుగు చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ కేసు మరోసారి కలకలం సృష్టించింది. నాలుగేళ్ల క్రితం హీరోలు రవితేజ, రానా దగ్గుబాటి, నవదీప్, తరుణ్, నందు, తనీష్, ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్, హీరోయిన్లు ఛార్మి, రకుల్, ఐటమ్ సాంగ్స్ స్పెషలిస్ట్ ముమైత్ ఖాన్ తదితరులను డ్రగ్స్ కేసులో ఎక్సైజ్ శాఖ పోలీసులు విచారించారు. చివరకు, ఏమీ లేదని తేల్చి చెప్పారు. అందరికీ ఆ కేసులో క్లీన్ చీట్ లభించింది. అయితే, ఈ కేసును ఇప్పుడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తిరగతోడుతోంది.
డ్రస్ కేసులో మొత్తం 12 మందికి నోటీసులు ఇచ్చింది. విచారణకు హాజరుకావాల్సిందిగా అందులో పేర్కొంది. ఎవరిని ఎప్పుడు విచారణకు రమ్మని ఈడీ నోటీసులు ఇచ్చిందంటే...
దర్శకుడు పూరి జగనాథ్ - ఆగస్టు 30
నటి, నిర్మాత ఛార్మి - సెప్టెంబర్ 2,
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ - సెప్టెంబర్ 6
హీరో రానా దగ్గుబాటి - సెప్టెంబర్ 8
హీరో రవితేజ - సెప్టెంబర్ 9
(రవితేజ మేనేజర్?) శ్రీనివాస్ - సెప్టెంబర్ 9
హీరో నవదీప్ - సెప్టెంబర్ 13
ఎఫ్ క్లబ్ జీఎం - సెప్టెంబర్ 13
ముమైత్ ఖాన్ - సెప్టెంబర్ 15
హీరో తనీష్ - సెప్టెంబర్ 17
యాక్టర్ నందు - సెప్టెంబర్ 20
హీరో తరుణ్ - సెప్టెంబర్ 22
కరోనా కారణంగా దెబ్బ తిన్న సినిమా ఇండస్ట్రీ మళ్ళీ ఇప్పుడిప్పుడే గాడిలో పడటానికి, మునుపటి వైభవాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఈ సమయంలో మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు డ్రగ్స్ కేసు ఇండస్ట్రీని మరోదెబ్బ కొడుతోంది.
![]() |
![]() |