![]() |
![]() |

ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తోన్న ప్యాన్ ఇండియా ఫిల్మ్ 'సలార్'. శ్రుతి హాసన్ నాయికగా నటిస్తోన్న ఈ మూవీలో జగపతిబాబు విలన్‌గా నటిస్తున్నారు. 'రాజమనార్' అనే క్యారెక్టర్‌ను పోషిస్తున్నట్లు సోమవారం రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ద్వారా తెలియజేశారు. ఈ పోస్టర్‌లో ఓల్డ్ గెటప్‌లో క్రూరమైన చూపులతో కనిపిస్తున్నారు జగ్గూ భాయ్. చుట్ట కాలుస్తున్న ఆయన ముక్కుకు రింగు కూడా ఉంది. చూపులకే ఇంత భీకరంగా కనిపిస్తోన్న ఆయన క్యారెక్టర్ సినిమాలో ఇంకెంత భయంకరంగా ఉంటుందో ఊహించుకోవాల్సిందే.
సినిమా నిర్మాణ సంస్థ హోంబళే ఫిలిమ్స్ తన అఫిషియల్ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా జగపతిబాబు లుక్‌ను షేర్ చేసి, "Introducing @IamJagguBhai as 𝐑𝐚𝐣𝐚𝐦𝐚𝐧𝐚𝐚𝐫 from #Salaar ." అంటూ ట్వీట్ చేసింది. 'అరవింద సమేత'లో రాయలసీమ ఫ్యాక్షనిస్టుగా భయంకరంగా కనిపించిన జగ్గూ భాయ్.. ఇప్పుడు 'సలార్'లో అదే తరహా క్యారెక్టర్‌ను పోషిస్తున్నట్లు కనిపిస్తోంది.
హోంబళే ఫిలిమ్స్ బ్యానర్‌పై విజయ్ కిరంగదూర్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఓవైపు ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో రూపొందిన 'కేజీఎఫ్ చాప్టర్ 2' పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుతూనే, మరోవైపు 'సలార్' మూవీ షూటింగ్‌ను ఆయన నిర్వహిస్తున్నారు. 'కేజీఎఫ్' సిరీస్‌కు పనిచేసిన మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్, సినిమాటోగ్రాఫర్ భువన్ గౌడ ఈ సినిమాకూ వర్క్ చేస్తున్నారు.
![]() |
![]() |