![]() |
![]() |

గోపీచంద్, తమన్నా జంటగా సంపత్ నంది దర్శకత్వంలో రూపొందిన 'సీటీమార్' మూవీని థియేటర్లలోనే విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. దిగంగనా సూర్యవంశీ మరో నాయికగా నటించిన ఈ సినిమా నేరుగా ఓటీటీలో రిలీజవుతుందని ఇటీవల ప్రచారంలోకి వచ్చింది. అయితే ఆ ప్రచారాన్ని ఖండిస్తున్నట్లుగా సెప్టెంబర్‌లో 'సీటీమార్'ను థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ధ్రువీకరించారు. రిలీజ్ డేట్ మాత్రం ప్రకటించలేదు.
సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా ఒక పోస్టర్‌ను షేర్ చేసిన నిర్మాతలు, "ఆట నడుస్తోంది. సెప్టెంబర్‌లో బిగ్ స్క్రీన్స్‌లోకి 'సీటీమార్' వస్తుంది. కౌంట్‌డౌన్ మొదలైంది. రిలీజ్ డేట్ కోసం ఈ స్పేస్ చూస్తుండండి." అంటూ రాసుకొచ్చారు. నిజానికి ఏప్రిల్‌లోనే 'సీటీమార్' రిలీజ్ కావాల్సింది. కానీ కొవిడ్ పరిస్థితుల వల్ల పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఆలస్యం కావడం, థియేటర్లు మూతపడటం లాంటి కారణాలతో వాయిదాపడి, ఇప్పుడు రిలీజ్‌కు రెడీ అవుతోంది.

గోపీచంద్ ఆంధ్రా కబడ్డీ టీమ్ కోచ్‌గా, తమన్నా తెలంగాణ కబడ్డీ టీమ్ కోచ్‌గా నటించిన ఈ సినిమా స్పోర్ట్స్ డ్రామా మేళవించిన యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. మణిశర్మ మ్యూజిక్ సమకూర్చిన 'జ్వాలారెడ్డి', 'పెప్సీ ఆంటీ' సాంగ్స్ సంగీతప్రియులను అలరించాయి. ఈ మూవీలో భూమిక ఒక కీలక పాత్ర చేశారు. 'గౌతమ్ నంద' మూవీ తర్వాత గోపీచంద్, సంపత్ నంది కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ఇది.
![]() |
![]() |