![]() |
![]() |

కామెడీ నటుడు, భారీ చిత్రాల నిర్మాత బండ్ల గణేశ్ కథానాయకుడిగా మారుతున్నారు. ఆయన హీరోగా ఓ చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమా ద్వారా వెంకట్ చంద్ర దర్శకుడిగా పరిచయమవుతున్నారు. యష్ రిషి ఫిలిమ్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్1గా ఈ మూవీని స్వాతి చంద్ర నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ తొలివారంలో సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.
ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ "మా సబ్జెక్టులో హీరో పాత్రకు బండ్ల గణేశ్ అయితేనే న్యాయం చేయగలుగుతారని ఆయనను సంప్రదించాం. ఆయన ఓకే చెప్పడంతో మాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా కోసం ఆయన ప్రత్యేకంగా మేకోవర్ అవుతున్నారు. తమిళంలో ఆర్. పార్తీపన్ గారు హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం వహించిన బ్లాక్ బాస్టర్ సినిమా 'ఒత్త సెరుప్పు సైజ్ 7'కి రీమేక్ ఇది. పార్తిబన్ కి జాతీయ పురస్కారంతో పాటు స్పెషల్ జ్యూరీ అవార్డు లభించింది. ఆ సినిమాకు పలు పురస్కారాలు దక్కాయి. సెప్టెంబర్ తొలి వారంలో చిత్రీకరణ ప్రారంభిస్తాం" అని చెప్పారు. ఈ చిత్రానికి అరుణ్ దేవినేని సినిమాటోగ్రాఫర్‌గా, గాంధీ ఆర్ట్ డైరెక్టర్‌గా వర్క్ చేస్తున్నారు.
'ఒత్త సెరుప్పు సైజ్ 7'ను హిందీలో అభిషేక్ బచ్చన్ హీరోగా రీమేక్ చేస్తుండటం గమనార్హం. చెన్నైలో ఆ సినిమా చిత్రీకరణ రీసెంట్‌గా ప్రారంభమైంది.
![]() |
![]() |